ఆరుగురు ఒప్పో ఉద్యోగులకు కరోనా.. మూతపడ్డ ఫ్యాక్టరీ

  • Published By: nagamani ,Published On : May 18, 2020 / 07:15 AM IST
ఆరుగురు ఒప్పో ఉద్యోగులకు కరోనా.. మూతపడ్డ  ఫ్యాక్టరీ

కరోనా దెబ్బను ఏ కంపెనీ కూడా తప్పించుకోలేకపోతోంది. పెద్ద పెద్ద కంపెనీలకే మూసివేస్తున్న పరిస్థితులు నెలకొన్న క్రమంలో ప్రముఖ మొబైల్‌ కంపెనీ ఒప్పోకి చెందిన ఆరుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌ అని తేలింది. ఈ  విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. దీంతో యూపీలోని గ్రేటర్‌ నోయిడాలోని ఒప్పో ఫ్యాక్టరీని అధికారులు మూసివేశారు. ఆరుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్ అని తేలటంతో కంపెనీలోని మరో మూడు వేలమంది ఉద్యోగులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. 

కరోనా వైరస్‌ విస్తరించకుండా ఉండటానికి కేంద్రప్రభుత్వం మార్చి 24న దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో నోయిడా పారిశ్రామిక వాడలోని ఒప్పో మొబైల్‌ ఫోన్ల తయారీ కేంద్రంలో కార్యకలాపాలు నిలిచిపోవటం..కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నిబంధనల సడలింపులతో తిరిగి మే 8న కంపెనీ ప్రారంభమైంది.
 

ఈ క్రమంలో ఒప్పో కంపెనీలో పనిచేస్తున్న మూడు వేలకుపైగా ఉద్యోగులకు కరోనా పరీక్షలు నిర్వహించగా ఆరుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో మిగతా అందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. 

Read Here>> భారత్ పై కరోనా ఎఫెక్ట్.. 13.5 కోట్ల ఉద్యోగాలకు ముప్పు, 12కోట్ల మంది పేదరికంలోకి