Corona Cases : తెలంగాణలో కొత్తగా 6,026 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ఒక్క రోజులో 6,026 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

Corona Cases : తెలంగాణలో కొత్తగా 6,026 కరోనా పాజిటివ్‌ కేసులు

6026 New Corona Positive Cases In Telangana

corona cases in Telangana : తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ఒక్క రోజులో 6,026 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో వైరస్ తో 52 మరణాలు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది.

కొత్తగా 79,824 మందికి టెస్టులు చేయగా.. 6,026 కేసులు వెలుగు చూశాయని పేర్కొంది. తాజాగా కరోనా నుంచి 6,551 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 77,127 యాక్టివ్ కేసులు ఉన్నాయని చెప్పింది.

కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 1,115, మేడ్చల్‌ మల్కాజ్‌గిరిలో 418, రంగారెడ్డి జిల్లాలో 403 కేసులు నమోదయ్యాయని వెల్లడించింది.