Life Imprisonment : తెలంగాణలో ఐదున్నర నెలల్లో 63 మందికి జీవిత ఖైదు

2021లో తీవ్ర నేరాలకు సంబంధించిన 110 కేసుల్లో దోషులకు జీవిత ఖైదు విధించిన కోర్టులు గతేడాది 152 కేసుల్లో దోషులకు జీవిత ఖైదు విధించాయి. దీంతో లైఫ్ కన్విక్షన్స్ రేటు కేవలం ఏడాదిలోనే 38శాతం పెరిగింది.

Life Imprisonment : తెలంగాణలో ఐదున్నర నెలల్లో 63 మందికి జీవిత ఖైదు

Life Imprisonment

Telangana Life Imprisonment : సమాజంలో కొందరు క్షణికావేశానికి గురై జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇలాంటివారిలో చాలా మంది హత్యలు, అత్యాచారాలు, కిడ్నాప్ లు, పోక్సో, నార్కోటిక్ తదితర నేరాలకు పాల్పడుతున్నట్లు రిపోర్టులు చెబుతున్నాయి. వారికి కఠిన శిక్షలు పడేలా తెలంగాణ పోలీసులు కృషి చేస్తున్నారు. ఆధారాలను పక్కాగా సేకరించి నేరాలను నిరూపించడంతో నిజమైన దోషులకు శిక్షపడేలా చూస్తున్నారు. దీంతో ఈ ఏడాది జనవరి నుంచి మే 13 వరకు 63 మంది జీవిత ఖైదుకు గురయ్యారు.

వారిలో సంగారెడ్డి జిల్లాకు చెందిన 8మంది సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఏడుగురు, రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఆరుగురు, ఉమ్మడి వరంగల్ లో ఆరుగురు, ఉమ్మడి నిజామాబాద్ నుంచి ఆరుగురు, హైదరాబాద్ కు చెందిన ఐదుగురు ఉన్నట్లు డీజీపీ అంజనీకుమార్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. నేరాల నిరూపణలో తెలంగాణ పోలీసుల చిత్తశుద్ధి వల్ల శిక్షల శాతం క్రమంగా పెరుగుతోంది.

Methamphetamine Drugs : హిందూ మహాసముద్రంలో అక్రమంగా తరలిస్తున్న.. రూ.25 వేల కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత

2021లో తీవ్ర నేరాలకు సంబంధించిన 110 కేసుల్లో దోషులకు జీవిత ఖైదు విధించిన కోర్టులు గతేడాది 152 కేసుల్లో దోషులకు జీవిత ఖైదు విధించాయి. దీంతో లైఫ్ కన్విక్షన్స్ రేటు కేవలం ఏడాదిలోనే 38శాతం పెరిగింది. తెలంగాణ పోలీసులు చిత్తశుద్ధితో ఆధారాలు సేకరిస్తున్నారు కాబట్టే నేరస్థులకు సరైన సమయంలో జైలు శిక్షలు పడుతున్నాయని డీజీపీ అంజనీకుమార్ పేర్కొన్నారు.

ఈ విషయంలో ఎంతో నిబద్ధతతో వ్యవహరిస్తున్న పోలీసు అధికారులకు అభినందనలు తెలిపారు. ప్రజలకు శాంతి భద్రతలు కల్పించడం, కరుడుగట్టిన నేరస్థులకు శిక్షించడం ప్రతి పోలీసు బాధ్యత అన్నారు. నిజమైన నేరస్థులకు శిక్ష పడేలా వ్యవహరించినప్పుడే న్యాయాన్ని కాపాడగలుగుతామని చెప్పారు. ఆ దిశగా రాష్ట్ర పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు విజయవంతం కావాలన్నారు.