nizamabad : నిజామాబాద్ లో పెళ్లి, 86 మందికి కరోనా

పెళ్లిళ్లు, బర్త్ డేలు, ఇతర వేడుకలు నిర్వహిస్తున్నారు. ఒకవేళ నిర్వహించినా..తక్కువ సంఖ్యలో జనాలు హాజరు కావాలని చెప్పినా..డోంట్ కేర్ అంటున్నారు.

nizamabad : నిజామాబాద్ లో పెళ్లి, 86 మందికి కరోనా

coronavirus positive

coronavirus positive : తెలంగాణ రాష్ట్రంలో కరోనా ప్రకంపనలు సృష్టిస్తోంది. గత సంవత్సరంలో ఎలాంటి పరిస్థితి ఉందో..అలాంటి మరలా వస్తుందానన్న భయం అందరిలో నెలకొంది. పాజిటివ్ కేసులు పెరుగుతుడడంతో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. మాస్క్ తప్పనిసరిగా ధరించాలని లేకపోతే ఫైన్ వేస్తామని హెచ్చరించింది. కానీ..కొంతమంది నిర్లక్ష్యంగా ఉంటుండడంతో కరోనా కేసులు పెరుగుతున్నాయని అంటున్నారు. పెళ్లిళ్లు, బర్త్ డేలు, ఇతర వేడుకలు నిర్వహిస్తున్నారు. ఒకవేళ నిర్వహించినా..తక్కువ సంఖ్యలో జనాలు హాజరు కావాలని చెప్పినా..డోంట్ కేర్ అంటున్నారు. ఫంక్షన్ హాజరైన వారిలో ఒక్కరికి కరోనా ఉన్నా..అందరికీ సోకుతోంది.

ఇలాగే..నిజామాబాద్ జిల్లాలోని వర్ని మండలం సిద్ధాపూర్ లో గురువారం ఓ పెళ్లి జరిగింది. ఈ వేడుకలకు చాలా మందే హాజరయ్యారు. అయితే..హాజరైన వారిలో కరోనా ఉందని తేలడంతో అందరీలో కలవరం మొదలైంది. వైద్యాధికారులు అప్రమత్తమై…కరోనా టెస్టులు చేయగా 86 మందికి కరోనా ఉందని నిర్ధారణ అయ్యింది. మూడు రోజులుగా పరీక్షల శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 370 మందికి టెస్టులు చేశారు. జిల్లాలో గత 26 రోజుల్లో 865 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. పలు ప్రాంతాల్లో క్వారంటైన్ ఏర్పాటు చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.