ECMO Treatment : కరోనా బాధిత చిన్నారికి ‘ఎక్మో’ చికిత్స.. దేశంలోనే తొలిసారి

దేశంలో కరోనా వైరస్‌ సెకండ్‌వేవ్‌ వ్యాప్తితో తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. మొదటివేవ్‌కు కంటే వేగంగా ప్రమాదకరంగా మారింది.. ప్రధానంగా యువకులు, చిన్న పిల్లల్లో కూడా సెకండ్‌ వేవ్‌ ప్రభావం చూపుతోంది.

ECMO Treatment : కరోనా బాధిత చిన్నారికి  ‘ఎక్మో’ చికిత్స.. దేశంలోనే తొలిసారి

9 Month Old Covid Positive Baby Saved With Ecmo Hyderabad

ECMO Treatment : దేశంలో కరోనా వైరస్‌ సెకండ్‌వేవ్‌ వ్యాప్తితో తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. మొదటివేవ్‌కు కంటే వేగంగా ప్రమాదకరంగా మారింది.. ప్రధానంగా యువకులు, చిన్న పిల్లల్లో కూడా సెకండ్‌ వేవ్‌ ప్రభావం చూపుతోంది. కరోనాతో ఆరోగ్యం విషమించిన 9 నెలల శిశువుకు కిమ్స్‌ ఆస్పత్రుల వైద్యుల బృందం ఎక్మో (ECMO) ట్రీట్ మెంట్ అందించి ప్రాణాలు రక్షించారు.

సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రి సీనియర్‌ పీడియాట్రిషన్‌ వైద్యులు వి.నందకిశోర్‌, డి.పరాగ్‌ శంకర్రావు డెకాటే నేతృత్వంలోని పీడియాట్రిక్‌ ఇంటెన్సివ్‌కేర్‌ (ICU) బృందం, ఎక్మో ట్రీట్ మెంట్ సక్సెస్ అయింది. ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన 9 నెలల శ్రీయాష్‌ చిన్నారి.. కొన్నిరోజులుగా తీవ్ర జ్వరం, దగ్గుతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతోంది. నెల క్రితమే బాలుడి తల్లిదండ్రులు కొండాపూర్‌లోని కిమ్స్‌ కడిల్స్‌ ఆస్పత్రిలో చేర్పించారు. శిశువును పరీక్షించిన డాక్టర్ల బృందం ఆక్సిజన్‌ స్థాయిలు చాలా తక్కువగా ఉన్నట్టు తెలిపారు. వెంటనే ఐసీయూకు తరలించి వెంటిలేటర్‌పై చికిత్స ప్రారంభించారు.

ఊపిరితిత్తుల (pneumothorax) నుంచి గాలి లీక్‌ అవుతోంది. దాంతో డాక్టర్ల బృందం ఎక్మో సపోర్ట్‌తో ట్రీట్ మెంట్ మొదలుపెట్టింది. మరింత మెరుగైన చికిత్స కోసం బాలుడిని సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రికి మార్చారు. 12 రోజుల పాటు ఎక్మో సపోర్టుతో చికిత్స అందించారు. చిన్నారి క్రమంగా కోలుకోవడంతో ఎక్మోను తొలగించారు. మరో 3 రోజులు వెంటిలేటర్‌ చికిత్సను అందించారు.

తల్లి ఫీడింగ్ కూడా చిన్నారి తీసుకోవడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. కొవిడ్‌ బారిన పిల్లల చికిత్సలో ఎక్మో వాడటం దేశంలోనే ఇది మొదటిసారిగా వైద్యులు తెలిపారు. సెకండ్‌వేవ్‌లో చాలా మంది పిల్లలు కొవిడ్‌ బారిన పడినప్పటికీ.. చాలా మంది పిల్లలు ఆస్పత్రి చికిత్స అవసరం లేకుండానే కోలుకున్నారు. కొంత మంది పిల్లలకు మాత్రమే ఆస్పత్రి, ఐసీయూ చికిత్స అవసరం పడుతుందని తెలిపారు.