పెళ్లి చేసుకుంటానని వంచించిన మోసగాడు : యువతికి మరొకరితో నిశ్చితార్థం..వరుడికి ఫోన్‌ చేసి తమ ప్రేమాయణం గురించి చెప్పిన యవకుడు

పెళ్లి చేసుకుంటానని వంచించిన మోసగాడు : యువతికి మరొకరితో నిశ్చితార్థం..వరుడికి ఫోన్‌ చేసి తమ ప్రేమాయణం గురించి చెప్పిన యవకుడు

young man cheated a young woman : ప్రేమించానంటూ ఓ యువతిని లొంగదీసుకుని.., పెళ్లి ఊసెత్తితే ముఖం చాటేశాడో యువకుడు. పెళ్లి చేసుకోమని పదేపదే కోరితే బెదిరింపులకు దిగాడు. ఇంతలో బాధిత యువతికి మరో యువకుడితో పెళ్లి నిశ్చయించారు పెద్దలు. అయితే ఆ పెళ్లిని కూడా చెడగొట్టాడు. వరుడికి ఫోన్‌ చేసి తామిద్దరం ప్రేమించుకున్నామంటూ యువతిని మోసం చేసిన రాజు చెప్పాడు.

కార్మికనగర్‌లో ఉండే రాజు అనే యువకుడు.. 23 ఏళ్ల బీకాం విద్యార్థినితో శారీరక సంబంధం
పెట్టుకున్నాడు. ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుంటానంటూ మాయమాటలు చెప్పాడు. పెళ్లి చేసుకోమంటే తప్పించుకుని తిరిగాడు. పదేపదే పెళ్లి గురించి ప్రస్తావిస్తే బాధిత యువతిపై బెదిరింపులకు పాల్పడ్డాడు.

తనను ప్రేమ పేరుతో మోసం చేయడమే కాకుండా, తన పెళ్లి కూడా చెడగొట్టేసరికి కార్మికనగర్‌లో నివాసముండే 23 ఏళ్ల బాధిత విద్యార్థిని జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.