Kidnap Child Safe : సికింద్రాబాద్ లో చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతం.. క్షేమంగా తల్లి ఒడికి చేర్చిన పోలీసులు

సికింద్రాబాద్ లో చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. కిడ్నాప్ కు గురైన చిన్నారి ఎట్టకేలకు తల్లి ఒడికి చేరింది. చిన్నారి కృతికను మహంకాళి పోలీసులు క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. తమ పాపను క్షేమంగా తీసుకొచ్చిన పోలీసులకు కృతిక పేరెంట్స్ కృతజ్ఞతలు తెలిపారు.

Kidnap Child Safe : సికింద్రాబాద్ లో చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతం.. క్షేమంగా తల్లి ఒడికి చేర్చిన పోలీసులు

CHILD SAFE

Kidnap Child Safe : సికింద్రాబాద్ లో చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. కిడ్నాప్ కు గురైన చిన్నారి ఎట్టకేలకు తల్లి ఒడికి చేరింది. చిన్నారి కృతికను మహంకాళి పోలీసులు క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. తమ పాపను క్షేమంగా తీసుకొచ్చిన పోలీసులకు కృతిక పేరెంట్స్ కృతజ్ఞతలు తెలిపారు. నిన్న ఉదయం మహంకాళి టెంపుల్ దగ్గర చిన్నారి కృతికను కిడ్నాప్ చేసిన సైకో రాము తన స్వస్థలమైన సిద్దిపేట జిల్లా దూల్ మిట్టకు తీసుకెళ్లాడు.

అక్కడ గ్రామస్తులకు అనుమానం వచ్చి పాపను విచారించగా అసలు విషయం బయటపడింది. గ్రామస్తులు వెంటనే సర్పంచ్ కు సమాచారం ఇ్వవగా ఆయన సిద్దిపేట పోలీసులను అప్రమత్తం చేశారు. హుటాహుటిన రంగంలోకి దిగిన సిద్ధిపేట పోలీసులు.. సైకోను అదుపులోకి తీసుకుని పాప కృతికను రక్షించారు. పాప చెవి దుద్దులను కిడ్నాపర్ తీసుకున్నాడని కృతిక తన తల్లితో ఫోన్ లో చెప్పింది.

Girl Child Kidnapped In Nellore : నెల్లూరు జిల్లాలో చిన్నారి కిడ్నాప్ కలకలం.. స్కూటీలో ఎత్తుకెళ్లిన మహిళలు

పాపను రక్షించిన పోలీసులు.. సికింద్రాబాద్ నార్త్ జోన్ డీసీపీ చందన దీప్తికి సమాచారం ఇచ్చారు. డీసీపీ ఫోన్ లో వీడియో కాల్ ద్వారా పాపను తల్లితో మాట్లాడించారు. కృతిక కిడ్నాప్ సమాచారం అందగానే పోలీసులు హుటాహుటినా రంగంలోకి దిగారు. పది టీమ్ లుగా ఏర్పడిన పోలీసులు పాపం కోసం హైదరాబాద్ నగరంతోపాటు చుట్టు పక్కల జిల్లాల్లో జల్లెడ పట్టారు.

ఉదయం కృతికను కిడ్నాప్ చేసిన సైకో రాము మందుగా మహంకాళి టెంపుల్ నుంచి ఆటోలో జేబీఎస్ కు వెళ్లాడు. అక్కడి నుంచి సిద్ధిపేట జిల్లా దూల్ మిట్టకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిపై కిడ్నాప్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసినట్లు డీసీపీ చందన దీప్తి చెప్పారు.