Sexually Assaulted : హైదరాబాద్‌ ఉప్పల్‌లో దారుణం.. నాలుగేళ్ల కొడుకుపై తండ్రి లైంగిక వేధింపులు

వీణారెడ్డికి భరత్‌రెడ్డితో 11 ఏళ్ల క్రితం పెళ్లైంది. వారికి నాలుగేళ్ల బాబు ఉన్నారు. అభిప్రాయబేధాలతో భర్త నుంచి వీణారెడ్డి విడాకులు తీసుకుంది.

Sexually Assaulted : హైదరాబాద్‌ ఉప్పల్‌లో దారుణం.. నాలుగేళ్ల కొడుకుపై తండ్రి లైంగిక వేధింపులు

Father

కడుపున పుట్టిన పిల్లలపై ఎవరైనా దుర్మార్గాలకు ఒడికడతారా..? అల్లారు ముద్దుగా పెంచుకోవాల్సిన పిల్లలను ఎవరైనా లైంగిక కోణంలో చూస్తారా..? కానీ ఓ కామాంధుడు అదే పనిచేశాడు. నాలుగేళ్ల వయస్సున్న కన్న కొడుకుపైనే లైంగిక దాడి చేశాడు. ఈ దారుణం హైదరాబాద్ ఉప్పల్‌లో జరిగింది.

దీనిపై బాలుడి తల్లి వీణారెడ్డి ఉప్పల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీణారెడ్డికి భరత్‌రెడ్డితో 11 ఏళ్ల క్రితం పెళ్లైంది. వారికి నాలుగేళ్ల బాబు ఉన్నారు. గతంలో భరత్‌రెడ్డి, వీణారెడ్డి విడాకులు తీసుకున్నారు. అభిప్రాయబేధాలతో భర్త నుంచి వీణారెడ్డి విడాకులు తీసుకుంది. కోర్టు ఆదేశాల ప్రకారం బాబును కొన్ని రోజులు మాజీ భర్త వద్ద ఉంచింది.

Supreme Court : నీట్ పీజీ కౌన్సిలింగ్ కు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

ఆ సమయంలో పిల్లాడిని భరత్‌రెడ్డి చిత్ర హింసలు పెట్టాడు. లైంగికంగా దాడి చేశాడు. దీనికి సంబంధించి డాక్టర్‌ రిపోర్టును కూడా పోలీసులకు అందించిన వీణారెడ్డి.. తమకు న్యాయం చేయాలని కోరుతోంది. తనకు, కుమారుడికి రక్షణ కల్పించాలని కోరింది.