Fire Broke Out : అమ్రాబాద్ నల్లమల రిజర్వ్ ఫారెస్ట్ లో అగ్నిప్రమాదం

నాగర్ కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ నల్లమల రిజర్వ్ ఫారెస్ట్ లో అగ్నిప్రమాదం జరిగింది. దోమలపెంట వద్ద శ్రీశైలం ప్రధాన రహదారి పక్కన మంటలు చెలరేగాయి.

Fire Broke Out : అమ్రాబాద్ నల్లమల రిజర్వ్ ఫారెస్ట్ లో అగ్నిప్రమాదం

Fire Broke Out : నాగర్ కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ నల్లమల రిజర్వ్ ఫారెస్ట్ లో అగ్నిప్రమాదం జరిగింది. దోమలపెంట వద్ద శ్రీశైలం ప్రధాన రహదారి పక్కన మంటలు చెలరేగాయి. 5 హెక్టార్ల వరకు నల్లమల అటవీ ప్రాంతం అగ్నికి ఆహుతైంది. స్థానికులు అటవీ అధికారులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.

తరచుగా నల్లమల అటవీప్రాంతంలో అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. గతంలో కూడా అమ్రాబాద్ మండలం దోమలపెంట రిజర్వ్ ఫారెస్టులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. శ్రీశైలం-హైదరాబాద్ రహదారిపై ప్రాంతంలో మంటలు చెలరేగాయి. దోమలపెంటకు ఏడు కిలోమీటర్ల దూరంలోని అక్టోపస్ వ్యూ నుంచి నీలారం బండవరకు మంటలు వ్యాపించాయి.

Fire In Mumbai : ముంబైలో భారీ అగ్నిప్రమాదం, భయాందోళనలో స్థానికులు

దాంతో నల్లమల అడవులు అంటుకున్నాయి. దాదాపు రెండు కిలో మీటర్ల మేర భారీగా మంటలు వ్యాపించాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్ లతో మంటలను ఆర్పివేశారు. ఎలాంటి ప్రాణ నష్టం జరుగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.