MLA Purchase Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైకోర్టు సర్టిఫైడ్ ఆర్డర్ కాపీ సీబీఐకి చేరింది. ఏ క్షణమైనా సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేయనుంది. సింగిల్ బెంచ్ ఆర్డర్ పై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది.

MLA Purchase Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం

HIGH COURT

MLA purchase case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైకోర్టు సర్టిఫైడ్ ఆర్డర్ కాపీ సీబీఐకి చేరింది. ఏ క్షణమైనా సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేయనుంది. సింగిల్ బెంచ్ ఆర్డర్ పై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఇప్పటికే సిట్ దర్యాప్తును హైకోర్టు రద్దు చేసింది. సీబీఐ దర్యాప్తుకు హైకోర్టు ఆదేశించింది. తెలంగాణ ప్రభుత్వానికి సీబీఐ లేఖ రాసింది. హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలతో తెలంగాణ ప్రభుత్వానికి సీబీఐ సమాచారం ఇచ్చింది.

ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. ఫామ్ హౌజ్ కేసును హైకోర్టు సీబీఐకి బదిలీ చేసింది. మొయినాబాద్ పీఎస్ ఎఫ్ఐఆర్ ను సీబీఐకి బదిలీ చేసింది. సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేయనుంది. క్రైమ్ నెం.455/2022 ఆధారంగా సీబీఐ కేసు నమోదు చేయనుంది. ఎఫ్ఐఆర్ నమోదుకు సంబంధించిన అన్ని అంశాలను సీబీఐ పరిశీలిస్తోంది.

TRS MLAs Trap Issue : టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు రూ.100 కోట్ల డీల్? దీని వెనుకున్నది వారేనా?

సీబీఐ న్యాయ నిపుణులు సింగిల్ బెంచ్ ఆర్డర్ కాపీని పరిశీలిస్తోన్నారు. ఏ సెక్షన్స్ కింద కేసులు నమోదు చేయాలన్న దానిపై చర్చలు సాగతున్నాయి. ఫామ్ హౌస్ కేసులో నేడో, రేపో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం ఉంది. సింగిల్ బెంచ్ ఆదేశాలపై రేపు కూడా వాదనలు కొనసాగనున్నాయి.

రేపు మధ్యాహ్నం 12 గంటలకు వాదనలు జరుగనున్నాయి. కేసును సీబీఐకి బదిలీ చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేసింది. కేసును సీబీఐకి బదిలీ చేయవద్దని కోర్టును కోరింది. ప్రభుత్వ అప్పీల్ పిటిషన్ విచారణను రేపటికి వాయిదా వేసింది. సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం వేసిన పిటిషన్ పై రేపు హైకోర్టులో వాదనలు కొనసాగనున్నాయి.