Mahabubabad : కుక్క కరుస్తుందని పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసిన వ్యక్తి

ఇప్ప‌టికి మూడు‌సార్లు కరి‌చిందని ఫిర్యా‌దులో పేర్కొ‌న్నారు. కుక్కను కట్టే‌యా‌లని దాని యజ‌మా‌నికి చెబితే తనను దూషించాం‌డని తెలి‌పారు.

Mahabubabad : కుక్క కరుస్తుందని పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసిన వ్యక్తి

Police Complaint

Mahabubabad : తెలంగాణలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. కుక్కపై ఓ వ్యక్తి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఓ కుక్క తరుచూ కరు‌స్తుందని, దాని యజ‌మా‌నిపై చర్యలు తీసు‌కో‌వా‌లంటూ ఓ వ్యక్తి పోలీ‌సు‌లకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన మహ‌బూ‌బా‌బాద్‌ జిల్లాలో జరిగింది.

గూడూరు మండలం బ్రాహ్మ‌ణ‌పల్లి పరిధిలోని హాము‌తం‌డాకు చెందిన ధరా‌వత్‌ పూల్‌‌సింగ్‌ గూడూ‌రు‌లోని వ్యవ‌సాయ కార్యా‌లయం ముందు నుంచి సోమ‌వారం ఉదయం 6 గంట‌లకు నడు‌చు‌కుంటూ వెళ్తు‌న్నారు. అదే సమ‌యంలో అక్క‌డున్న ఓ కుక్క తన మీదికి వచ్చిందన్నారు. ఆ కుక్క తనను చూడ‌గానే కరు‌స్తుందని గోడు వెల్లబోసుకున్నారు.

US Police Arrest Hen : కోడిని అరెస్ట్ చేసిన అమెరికా పోలీసులు..!!

ఇప్ప‌టికి మూడు‌సార్లు కరి‌చిందని ఫిర్యా‌దులో పేర్కొ‌న్నారు. కుక్కను కట్టే‌యా‌లని దాని యజ‌మా‌నికి చెబితే తనను దూషించాం‌డని తెలి‌పారు. కుక్క యజ‌మా‌నిపై కేసు నమోదు చేస్తా‌మని పోలీ‌సులు చెప్ప‌డంతో పూల్‌‌సింగ్‌ అక్కడి నుంచి వెళ్లి‌పో‌యారు.