Petrol Attack : జగిత్యాల జిల్లాలో దారుణం.. అధికారులపై పెట్రోల్ స్ప్రే చేసి నిప్పంటించాడు
ఈ ఘటనలో ఎంపీవో రామకృష్ణ గాయపడగా.. ఎస్ఐతో పాటు ఇతర అధికారులు తృటిలో తప్పించుకున్నారు. గంగాధర్ ఇంటి వద్ద దారి విషయంలో చాలా కాలంగా వివాదం కొనసాగుతోంది.
sprayed petrol : జగిత్యాల జిల్లా తుంగూరులో దారుణం జరిగింది. రోడ్డు విషయంలో వివాదాన్ని పరిష్కరించడానికి వెళ్లిన అధికారులపై గంగాధర్ అనే వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఫర్టిలైజర్ స్ప్రే చేసే స్ప్రేయర్లో పెట్రోల్ పోసిన గంగాధర్.. అధికారులు రాగానే వారిపై స్ప్రే చేశాడు. అనంతరం నిప్పంటించాడు.
ఈ ఘటనలో ఎంపీవో రామకృష్ణ గాయపడగా.. ఎస్ఐతో పాటు ఇతర అధికారులు తృటిలో తప్పించుకున్నారు. గంగాధర్ ఇంటి వద్ద దారి విషయంలో చాలా కాలంగా వివాదం కొనసాగుతోంది. రోడ్డుకు అడ్డంగా కట్టెలు పెట్టిన గంగాధర్.. ఎవ్వరిని ఆ దారి గుండా నడవకుండా అడ్డుకుంటున్నాడు.
Hyd : ఎర్రగడ్డలో దారుణం.. యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన రాక్షసులు
దీంతో చుట్టుపక్కల వారు అనేక సార్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు కూడా ఇప్పటికే నాలుగైదు సార్లు చెప్పి చూశారు. అయినా తీరు మారకపోవడంతో ఈ రోజు మరోసారి అతని ఇంటికి చేరుకున్నారు. కానీ అంతలోనే పోలీసులపై గంగాధర్ పెట్రోల్ స్ప్రే చేసి నిప్పంటించాడు.