Police Torture Man Suicide Attempt : పోలీస్ కస్టడీలో ఉన్న యువకుడు ఆత్మహత్యాయత్నం..టార్చర్ భరించలేక స్టేషన్‌ బిల్డింగ్‌ పైనుంచి దూకి

వరంగల్ జిల్లాలో పోలీస్ కస్టడీలో ఉన్న యువకుడు ఆత్మహత్యాయత్నం కలకలం రేపుతోంది. వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్‌లో నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. కోమల్ల కుమార్ అనే యువకుడు పోలీసుల విచారణను తట్టుకోలేక పోలీస్ స్టేషన్‌ బిల్డింగ్‌ పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

Police Torture Man Suicide Attempt : పోలీస్ కస్టడీలో ఉన్న యువకుడు ఆత్మహత్యాయత్నం..టార్చర్ భరించలేక స్టేషన్‌ బిల్డింగ్‌ పైనుంచి దూకి

police torture man suicide attempt

Police Torture Man Suicide Attempt : వరంగల్ జిల్లాలో పోలీస్ కస్టడీలో ఉన్న యువకుడు ఆత్మహత్యాయత్నం కలకలం రేపుతోంది. వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్‌లో నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. కోమల్ల కుమార్ అనే యువకుడు పోలీసుల విచారణను తట్టుకోలేక పోలీస్ స్టేషన్‌ బిల్డింగ్‌ పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దొంగతనం కేసులో కొన్నిరోజులుగా కుమార్‌ను కొన్నిరోజులుగా పోలీసులు విచారిస్తున్నారు.

పోలీసుల విచారణలో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన కుమార్‌.. పోలీస్ స్టేషన్‌ భవనం పైనుంచి కిందకు దూకాడు. దీంతో అతనికి తీవ్రగాయాలయ్యాయి. విషయం బయటకు రాకుండా పోలీసులు హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి రహస్యంగా చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం కుమార్ పరిస్థితి విషమంగా ఉంది. బాధితుడి పరిస్థితిని చూసి కన్నీరు మున్నీరు అవుతున్నారు.

కొన్నిరోజులుగా కుమార్‌ను పోలీసులు హింసిస్తున్నారని కుటుంబసభ్యులు అంటున్నారు. దొంగతనం ఆరోపణ, పోలీసుల దెబ్బలతో కుమార్ మనస్తాపం చెందాడని చెబుతున్నారు. కుమార్ దొంగతనం చేయలేదని అంటున్నారు. పోలీసుల టార్చర్ భరించలేక ఆత్మహత్యకు ప్రయత్నించాడని కుటుంబసభ్యులు చెబుతున్నారు.