Cyber Fraud : తెలియకుండానే..అకౌంట్ల నుంచి డబ్బులు మాయం, హైదరాబాద్‌లో కొత్త తరహా సైబర్‌ క్రైమ్‌

హైదరాబాద్‌లో కొత్త తరహా సైబర్‌ క్రైమ్‌ వెలుగు చూసింది. తమకు తెలియకుండానే.. అకౌంట్ల నుంచి డబ్బులు మాయం అయినట్లు బాధితులు గుర్తించారు. అవసరాల కోసం నాలుగు డబ్బులను బ్యాంకు ఖాతాల్లో దాచుకుందామనుకునే వారు కూడా కలవరపడే పరిస్థితి. ఎలా జరిగిందని బ్యాంకు అధికారులను ఆరా తీస్తే... మాకేం తెలుసు అంటున్నారు.

Cyber Fraud : తెలియకుండానే..అకౌంట్ల నుంచి డబ్బులు మాయం, హైదరాబాద్‌లో కొత్త తరహా సైబర్‌ క్రైమ్‌

Hyd Cyber

Cyber Crime In Hyderabad : హైదరాబాద్‌లో కొత్త తరహా సైబర్‌ క్రైమ్‌ వెలుగు చూసింది. తమకు తెలియకుండానే.. అకౌంట్ల నుంచి డబ్బులు మాయం అయినట్లు బాధితులు గుర్తించారు. అవసరాల కోసం నాలుగు డబ్బులను బ్యాంకు ఖాతాల్లో దాచుకుందామనుకునే వారు కూడా కలవరపడే పరిస్థితి. ఎలా జరిగిందని బ్యాంకు అధికారులను ఆరా తీస్తే… మాకేం తెలుసు అంటున్నారు.

హైదరాబాద్‌కు చెందిన తులసి బాబు అనే వ్యక్తి తన అకౌంట్ నుంచి 4 లక్షల రూపాయలు మాయమైనట్లు సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే వెంకటేష్‌ అనే వ్యక్తి కూడా తనతో పాటు, తన భార్య అకౌంట్‌ నుంచి కలిపి మొత్తం నాలుగున్నర లక్షల రూపాయలు తగ్గటంతో… సైబర్‌ క్రైమ్‌ను ఆశ్రయించారు. కుమార్తె పెళ్లి కోసం రెండు అకౌంట్లలో రెండేళ్ల క్రితం సుమారు 5 లక్షల రూపాయలను డిపాజిట్‌ చేశారు. బ్యాంక్‌ ఖాతాలో సేఫ్‌గా ఉంటాయని నమ్మారు. కానీ… అక్కడ కూడా భద్రత లేదని తేలిపోయింది.

ఉప్పుగూడకు చెందిన వెంకటేష్‌ అకౌంట్‌ నుంచి 2 లక్షలు, భార్య అకౌంట్‌ నుంచి రెండున్నర లక్షలు మాయమైనట్లు గుర్తించారు. వెంటనే బ్యాంకు అధికారులను సంప్రదించగా… యూపీఐ ద్వారా ఇతరుల ఖాతాల్లోకి ట్రాన్స్‌ఫర్‌ అయినట్లు తెలిపారు. మరి ఫోన్లకు మెసేజ్‌ రాలేదు కదా అని ప్రశ్నించగా… మాకేం తెలియదని అధికారులు చెప్పడంతో… సైబర్‌ క్రైమ్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మోసంలో బ్యాంకు అధికారుల పాత్రపై కూడా దర్యాప్తు చేయాలని బాధితులు కోరుతున్నారు. నయా చీటింగ్‌పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Read More : Buddhadeb Dasgupta : బెంగాలీ ఫిలిం మేకర్ బుద్ధదేవ్ దాస్‌గుప్తా కన్నుమూత.. మోదీ, మమతా సంతాపం..