Revanth Reddy: ఈ ఫోటో మాట్లాడుతుంది.. ఎన్నో మాటలను..! -రేవంత్ రెడ్డి

ఎనుమల రేవంత్ రెడ్డి.. వాగ్ధాటితో, ఆకట్టుకునే ప్రసంగాలతో జనాదరణ పొందిన నాయకులలో ఒకరు. అనర్గళంగా తెలంగాణ యాసలో ఉపన్యాసాలు ఇవ్వగల, ప్రాంతాలకు అతీతంగా అభిమానులని సంపాదించుకున్న రేవంత్ రెడ్డి.

Revanth Reddy: ఈ ఫోటో మాట్లాడుతుంది.. ఎన్నో మాటలను..! -రేవంత్ రెడ్డి

A Picture Speaks More Than Words Revanth Reddy Shares A Photo In Instagram

Revanth Reddy: ఎనుమల రేవంత్ రెడ్డి.. వాగ్ధాటితో, ఆకట్టుకునే ప్రసంగాలతో జనాదరణ పొందిన నాయకులలో ఒకరు. అనర్గళంగా తెలంగాణ యాసలో ఉపన్యాసాలు ఇవ్వగల, ప్రాంతాలకు అతీతంగా అభిమానులని సంపాదించుకున్న రేవంత్ రెడ్డి.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అయ్యాక రాజకీయాల్లో దూకుడుగా ముందుకు సాగుతున్నారు.

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎంపికయ్యాక.. మరో వారంలో బాధ్యతలు చేపట్టబోతున్నారు.. కేడర్‌లో, లీడర్లలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి.

ఈ సమయంలో రేవంత్ రెడ్డికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. బలమైన శక్తిగా కాంగ్రెస్ పార్టీ మారుతుందా? లేదా? అనేది కాలమే నిర్ణయిస్తుంది. శక్తివంచన లేకుండా పార్టీకి పనిచేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొని రావడమే ధ్యేయంగా అడుగులు వేస్తూ.. వేగంగా నాయకులను కలుస్తోన్న రేవంత్ రెడ్డి.. లేటెస్ట్‌గా ఇన్‌స్టాగ్రమ్‌లో ఓ ఇంట్రస్టింగ్ పోస్ట్ చేశారు.

ఒక చిత్రం పదాల కంటే ఎక్కువగా మాట్లాడుతుంది అంటూ.. కారుపై తన బొమ్మను ఓ చిన్నారి ముద్దాడుతున్న ఫోటోను షేర్ చేశారు. ఈరోజు కూడా ప్రతి రోజులాగే ఉండేది, ఈ అందమైన చిన్నారి ఫోటో చూడకపోతే అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇక పలువురు నాయకులను వరుసగా కలుస్తూ వస్తున్న టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డికి తాజాగా మాజీ మంత్రి, తెలంగాణ నాయకులు నాగం జ‌నార్థ‌న్ రెడ్డి అభినంద‌నలు తెలిపారు.దీనికి సంబంధించిన ఫోటోను కూడా రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో పంచుకున్నారు.

ఇక జూలై 7వ తేదీ మధ్యాహ్నం 1:30 గంటలకు తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోనున్నట్లు ఇప్పటికే టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో తాను పాదయాత్ర చేసే అవకాశం ఉందని, అదెప్పుడన్నది పార్టీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. పార్టీ అధ్యక్షుడిగా వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోబోనని, సమష్టి నిర్ణయాలే ఉంటాయన్నారు. కార్యకర్తలకు తాను అండగా ఉంటానని, కార్యకర్తలకు కష్టం రాకుండా చూసుకుంటానని ఇప్పటికే వెల్లడించారు.