Uppal Match Tickets: జింఖానా గ్రౌండ్ వద్ద తొక్కిసలాట, పోలీసుల లాఠీచార్జి.. పలువురికి గాయాలు

ఉప్పల్ మ్యాచ్ టిక్కెట్ల కోసం అభిమానులు భారీ స్థాయిలో రావడంతో ఒక్కసారిగా తోపులాట జరిగింది. దీంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. ఈ ఘటనలో క్రికెట్ అభిమానులు, పోలీసులు కూడా గాయపడ్డారు. వీరిలో మహిళలు కూడా ఉన్నారు.

Uppal Match Tickets: జింఖానా గ్రౌండ్ వద్ద తొక్కిసలాట, పోలీసుల లాఠీచార్జి.. పలువురికి గాయాలు

Uppal Match Tickets: హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో జరగబోయే క్రికెట్ మ్యాచ్ టిక్కెట్లు విక్రయిస్తున్న జింఖానా గ్రౌండ్ వద్ద ఉద్రిక్తత తలెత్తింది. భారీ సంఖ్యలో అభిమానులు గుమిగూడటంతో క్యూ లైన్‌లో తొక్కిసలాట జరిగింది. దీంతో అభిమానులు ఒకరిపై ఒకరు పడిపోయారు.

Quadruplets Joy: ఒకే కాన్పులో నలుగురు పిల్లలు.. ఒడిశాలో జన్మనిచ్చిన మహిళ

వేలాదిమంది ఒక్కసారిగా రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు లాఠీఛార్జి చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో పలువురు కింద పడిపోయారు. అనేక మందికి గాయాలయ్యాయి. చాలా మంది స్పృహ తప్పి పడిపోయారు. వీరిలో మహిళలు కూడా ఉన్నారు. అభిమానుల్ని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో పలువురు పోలీసులూ గాయపడ్డట్లు సమాచారం. కాగా, టిక్కెట్ల కోసం గురువారం వేకువఝాము నుంచే భారీ స్థాయిలో అభిమానులు జింఖానా గ్రౌండ్ వద్ద బారులు తీరారు. ఈ రోజు ఉదయం పది గంటల నుంచి టిక్కెట్ల విక్రయాలు ప్రారంభమయ్యాయి. దీంతో మరింత మంది టిక్కెట్ల కోసం ఎగబడ్డారు. అయితే, టిక్కెట్ల విక్రయంలో హెచ్‌సీఏ వైఖరి సరిగ్గా లేదని అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Bathukamma: 25 నుంచి బతుకమ్మ సంబరాలు ప్రారంభం.. ఘనంగా వేడుకలకు సిద్ధం

విక్రయం ప్రారంభమై రెండు గంటలవుతున్నా వంద టిక్కెట్లు కూడా ఇవ్వలేదని అభిమానులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు స్టేడియం గేట్లు పగలగొట్టేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. వారిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జి చేశారు. దీంతో అటు పోలీసులకు, ఇటు అభిమానులకు గాయాలయ్యాయి. గాయపడ్డవారిని పోలీసులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. హెచ్‍‌సీఏ తీరుపై అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.