Tiger : గ్రామాల్లోకి వస్తున్న పులి.. హడలిపోతున్న ప్రజలు

ఆదిలాబాద్, నిర్మల్, పెద్దపల్లి, ఖమ్మం జిల్లాలో పులుల సంచారం ఎక్కువైంది. పులులు అడవిలోంచి గ్రామాల్లోకి వచ్చి ప్రజలను భయపెడుతున్నాయి. సాధుజంతువులపై దాడి చేసి చంపుకుతింటున్నాయి.

Tiger : గ్రామాల్లోకి వస్తున్న పులి.. హడలిపోతున్న ప్రజలు

Tiger

Tiger : ఆదిలాబాద్, నిర్మల్, పెద్దపల్లి, ఖమ్మం జిల్లాలో పులుల సంచారం ఎక్కువైంది. పులులు అడవిలోంచి గ్రామాల్లోకి వచ్చి ప్రజలను భయపెడుతున్నాయి. సాధుజంతువులపై దాడి చేసి చంపుకుతింటున్నాయి. పంటపొలాల్లో తిరుగుతూ రైతులను హడలెత్తిస్తున్నాయి. తాజాగా పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని అటవీ గ్రామాల్లో పులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. కొయ్యురు అటవీ ప్రాంతం నుండి మంథని మండలంలోని అడవి సోమనపల్లి గ్రామ పరిధిలో గల అటవీ ప్రాంతానికి పులి వచ్చినట్లు వారు తెలిపారు.

చదవండి : Tiger Scare In Bhadradri Dist : భద్రాద్రి జిల్లా వాసులను హడలెత్తిస్తున్న పులి సంచారం

అడవి సోమనపల్లి, వెంకటపూర్, అరేంద, ఖానాపూర్, కాన్సాయి పేట గ్రామస్తులు, పశువుల కాపరులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అటవీ అధికారులు, పోలీసులు సూచించారు. గ్రామ శివార్లకు వెళ్ళినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. మరోవైపు భూపాలపల్లి జిల్లా మల్హార్‌ అడవిలో కూడా పులి సంచరిస్తున్నట్లు తెలిపారు అధికారులు. నైనా గుట్టల్లో పులి తలదాచుకున్నట్లు గుర్తించారు. అయితే అడవిలోకి పరిసర ప్రాంతాల ప్రజలు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. పశువుల కాపరులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తప్పనిసరి అడవిలోకి వెళ్లాలంటే గుంపుగా వెళ్లడం మంచిదని అధికారులు పేర్కొన్నారు.

చదవండి : Tigers Attack On Cows : ఖమ్మం జిల్లా వాసులను వణికిస్తున్న పులుల సంచారం