Tractor Moved : డ్రైవ‌ర్ లేకుండానే దూసుకెళ్లిన ట్రాక్టర్‌

సాధారణంగా ఏదైనా వాహనం నడవాలంటే డ్రైవర్ డ్రైవ్ చేయాలి. అయితే మెద‌క్ జిల్లాలో మాత్రం డ్రైవ‌ర్ లేకుండానే ఓ ట్రాక్టర్‌ దూసుకెళ్లింది.

10TV Telugu News

tractor moved : సాధారణంగా ఏదైనా వాహనం నడవాలంటే డ్రైవర్ డ్రైవ్ చేయాలి. అయితే మెద‌క్ జిల్లాలో మాత్రం డ్రైవ‌ర్ లేకుండానే ఓ ట్రాక్టర్‌ దూసుకెళ్లింది. డ్రైవ‌ర్ డ్రైవ్ చేయకుండానే ట్రాక్టర్‌ బైకులపై దుసుకెళ్లడం స్థానికంగా కలకలం రేపింది. ఈ సంఘటన నర్సాపూర్‌ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఖాజీపేట్‌ గ్రామానికి చెందిన రమేష్‌ తన ట్రాక్టర్‌ను సర్వీసింగ్‌ చేయించి మెదక్‌ మార్గంలో గల ఓ వైన్స్‌ షాప్ సమీపంలో పార్క్‌ చేశాడు.

హడావిడిలో డ్రైవర్‌ ఇంజిన్‌ ఆఫ్‌ చేయకుండానే పక్కనున్న షాప్ లోకి వెళ్లాడు. ఇంతలో ట్రాక్టర్‌ ఉన్నట్టుండి ముందుకు వెళ్లి రోడ్డు పక్కన ఉన్న బైకులపైకి దూసుకెళ్లింది. దీంతో రెండు బైకులు పూర్తిగా ధ్వంసమవ్వగా మరో 10 బైకులు పాక్షికంగా దెబ్బతిన్నాయి.

అక్కడున్న ప్రయాణికులు స్పందించి బ్రేకులు వేసి ట్రాక్టర్‌ను ఆపారు. ఆ సమయంలో అక్కడ జనం ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

10TV Telugu News