రంగారెడ్డి జిల్లాలో ప్రేమోన్మాది దాడి : యువతిపై కత్తితో దాడి చేసిన యువకుడు

రంగారెడ్డి జిల్లాలో ప్రేమోన్మాది దాడి : యువతిపై కత్తితో దాడి చేసిన యువకుడు

A young man attacked a young woman : రంగారెడ్డి జిల్లా హైదర్షాకోట్‌లో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. లక్ష్మీనగర్‌లో నివాసముంటున్న యువతిపై ఆమె ఇంట్లోనే దాడి చేశాడు. కత్తితో పొడవడంతో.. ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితురాలు కేకలు వేయడంతో నిందితుడు అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు.

స్థానికులు అతడ్ని వెంబడించి పట్టుకున్నారు. నార్సింగ్ పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.