Aarogyasri Scheme : కరోనా బాధితులకు సహాయపడని ఆరోగ్య శ్రీ పథకం..ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లలేక మృత్యువాత

రాష్ట్రంలో అమలవుతున్న ఆరోగ్యశ్రీ పథకాన్ని, ఆయుష్మాన్ భవ పథకాన్ని కరోనా రోగులకు వర్తించేలాగా చర్యలు చేపట్టాలని వివిధ రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. గతంలో సీఎం కేసీఆర్ కూడా దీనిపై ప్రకటన చేశారు.

Aarogyasri Scheme : కరోనా బాధితులకు సహాయపడని ఆరోగ్య శ్రీ పథకం..ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లలేక మృత్యువాత

Aarogyasri Scheme

Aarogyasri scheme corona victims : రోజు రోజుకు కరోనా తీవ్రంగా విజృభిస్తుంది. ఎక్కడ ఏ హాస్పిటల్ చూసిన కోవిడ్ పేషంట్స్‌తో నిండిపోతోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్‌ దొరకడం లేదు. ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లలేని పేదల పరిస్థితేంటి? కరోనా బాధితులకు ఆరోగ్య శ్రీ స్కీమ్‌లు అసలు వర్తిస్తున్నాయా? తెలంగాణలో ఏ ప్రభుత్వ హాస్పిటల్ చూసిన బెడ్స్ ఫుల్ అయ్యాయి. హాస్పిటల్‌కి వెళ్తే బెడ్స్ లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. ఒక పక్క ప్రభుత్వం వైద్యం అందిస్తున్న చాలీ చాలని బెడ్స్. ఒక పక్క అన్ని రకాలుగా వైద్యం అందిస్తున్నాం.. అని ప్రభుత్వం చెబుతున్నా.. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరిగి ప్రజలు మాత్రం పిట్టల్లా రాలుతున్నారు.

ప్రభుత్వం ట్రెసింగ్, టెస్టింగ్, ట్రిటింగ్ సిస్టంతో పాటు హోం ఐసోలెషన్‌లో వైద్య సేవలు అందిస్తోంది. రోగుల సంఖ్యకు అనుగుణంగా ప్రజలు ఆశించిన స్థాయిలో వైద్య లేవు. చివరకు నైట్ కర్ఫ్యూ కూడా ప్రభుత్వం విధించింది. అయినా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో కరోనా వైద్యం కోసం వచ్చి ఆసుపత్రుల చుట్టు తిరుగుతూ రోగులు చనిపోతున్నారు. కొన్ని కార్పోరేట్ ఆసుపత్రులు బ్లాక్ దందాకి దిగుతున్నాయి. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా వైద్యానికి డబ్బులు చెల్లించలేక కొంతమంది ఆర్థికంగా నష్టపోతున్నారు. మరికొంతమంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు దొరకక… ప్రైవేట్ ఆసుపత్రిలకు వెళ్లే స్తోమత లేక మృత్యువాత పడుతున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో అమలవుతున్న ఆరోగ్యశ్రీ పథకాన్ని, ఆయుష్మాన్ భవ పథకాన్ని కరోనా రోగులకు వర్తించేలాగా చర్యలు చేపట్టాలని వివిధ రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. గతంలో సీఎం కేసీఆర్ కూడా దీనిపై ప్రకటన చేశారు. సీఎం కేసీఆర్ స్వయంగా అసెంబ్లీ లో కరోనాని ఆరోగ్య శ్రీలో చేర్చుతామని హామీ ఇచ్చారు. హామీ ఇచ్చి నెలలు గడుస్తున్నా.. ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు.

ప్రభుత్వం ఇకనైనా స్పందించి ఆరోగ్య శ్రీ లో చేర్చాలని ప్రజలు కోరుతున్నారు. కరోనా ని ఆరోగ్య శ్రీలో చేర్చాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సీతక్క నిరసన దీక్ష చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్‌లోకి కరోనాని తీసుకువచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయుష్మాన్ భారత్‌ను అడాప్ట్ చేసుకుంటామని తెలిపింది.