Nampally Court : జైలుకు వెళ్లనంటూ నాంపల్లి కోర్టులో నిందితుడు హల్ చల్

ఒక హత్య, దొంగతనం కేసులో ఆనంద్ నిందితుడిగా ఉన్నాడు. నెల రోజుల క్రితమే ఓ హత్య కేసులో జైలుకు వెళ్లి ఇటీవలే విడుదలయ్యారు.

Nampally Court : జైలుకు వెళ్లనంటూ నాంపల్లి కోర్టులో నిందితుడు హల్ చల్

Nampally Court

Accused Hal Chal : హైదరాబాద్ లోని నాంపల్లి కోర్టులో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. కోర్టులో నిందితుడు హంగామా సృష్టించాడు. జైలుకు వెళ్లనంటూ హల్ చల్ చేశాడు. జూన్ 25న తన పెళ్లి ఉందని, తాను జైలుకు వెళ్లనంటూ హచ్ చల్ చేశాడు. కోర్టు లోపల డోర్ కు ఉన్న అద్దాలను పగులగొట్టి, చేతికి గాయం చేసుకున్నాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రౌడీ షీటర్ ఆనంద్ అగర్వాల్ ను గంజాయి కేసులో్ శాలిబండ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం నాంపల్లి కోర్టులో నిందితుడిని హాజరుపరిచారు. ఇప్పటికే నిందితుడిపై 18 కేసులు నమోదు అయ్యాయి.

Supreme Court: రూ.2 వేల నోట్ల మార్పిడి పిటిషన్.. అత్యవసర విచారణ జరపం: సుప్రీంకోర్టు

తాజాగా గంజాయి కేసులో నాంపల్లి కోర్టు అతన్ని విచారించి, రిమాండ్ విధించింది. అయితే తనకు పెళ్లి కుదిరిందని జైలుకు వెళ్లనని రౌడీ షీటర్ ఆనంద్ మొండి కేశాడు. అంతటితో ఆగకుండా కోర్టు లోపల డోర్ అద్దాలను తన చేతితో పగులగొట్టాడు.

దీంతో అతని చేతికి తీవ్ర గాయం అయింది. ఒక హత్య, దొంగతనం కేసులో ఆనంద్ నిందితుడిగా ఉన్నాడు. నెల రోజుల క్రితమే ఓ హత్య కేసులో జైలుకు వెళ్లి ఇటీవలే విడుదలయ్యారు. తాజాగా గంజాయి కేసులో నిందితుడికి కోర్టు జైలు శిక్ష విధించింది. అయతే జైలుకు వెళ్లనంటూ కోర్టులో హంగామా సృష్టించాడు.