TSPSC Paper Leak: టీఎస్‌పీఎస్‌సీ లీక్ కేసులో నిందితుల రిమాండ్.. ప్రధాన నిందితుడు ప్రవీణ్‌కు యువతులతో సంబంధాలు

నిందితులను మరికొద్దిసేపట్లో పోలీసులు బేగం బజార్ పోలీస్ స్టేషన్ నుంచి రిమాండ్‌కు తరలించనున్నారు. అనంతరం నిందితులను కస్టడీలోకి తీసుకుని, విచారించాలని నిర్ణయించుకున్నారు. నిందితుల్ని కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తే మరిన్ని వివరాలు బయటకు వస్తాయని భావిస్తున్నారు. ప్రధాన నిందితుడు ప్రవీణ్‌కు సంబంధించి కీలక విషయాలు వెల్లడయ్యాయి.

TSPSC Paper Leak: టీఎస్‌పీఎస్‌సీ లీక్ కేసులో నిందితుల రిమాండ్.. ప్రధాన నిందితుడు ప్రవీణ్‌కు యువతులతో సంబంధాలు

TSPSC Paper Leak: టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. నిందితులను మరికొద్దిసేపట్లో పోలీసులు బేగం బజార్ పోలీస్ స్టేషన్ నుంచి రిమాండ్‌కు తరలించనున్నారు. అనంతరం నిందితులను కస్టడీలోకి తీసుకుని, విచారించాలని నిర్ణయించుకున్నారు.

Allu Arjun: తెలుగు పాట ఆస్కార్స్‌ను షేక్ చేయడం గర్వకారణం – అల్లు అర్జున్

నిందితుల్ని కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తే మరిన్ని వివరాలు బయటకు వస్తాయని భావిస్తున్నారు. ప్రధాన నిందితుడు ప్రవీణ్‌కు సంబంధించి కీలక విషయాలు వెల్లడయ్యాయి. ప్రవీణ్‌కు యువతులతో ఎక్కువ సంబంధాలు ఉన్నాయని పోలీసులు తేల్చారు. ప్రవీణ్ 2017లో టీఎస్‌పీఎస్‌సీలో జూనియర్ అసిస్టెంట్‌గా చేరాడు. నాలుగేళ్ల పాటు వెరిఫికేషన్ సెక్షన్‌లో పనిచేశాడు. ఈ సమయంలో వెరిఫికేషన్ సెక్షన్‌కు వచ్చే మహిళల ఫోన్ నెంబర్లు తీసుకునేవాడు. దరఖాస్తు సందర్భంలో తలెత్తే సాంకేతిక సమస్యలను పరిష్కరించి, మహిళలతో సాన్నిహిత్యం పెంచుకున్నాడు. ప్రవీణ్ మొబైల్ ఫోన్‌లో ఎక్కువ సంఖ్యలో మహిళల నెంబర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

YS Sharmila: కేసీఆర్ అవినీతి పాలనపై ఢిల్లీలో షర్మిల ర్యాలీ.. అరెస్ట్ చేసిన పోలీసులు

వాట్సప్ చాటింగ్‌లోనూ మహిళల నగ్న ఫోటోలు, దృశ్యాలను పోలీసులు గుర్తించారు. ఏఈ పరీక్ష పత్రం కూడా రేణుక కారణంగానే లీక్ అయిందని పోలీసులు తేల్చారు. ప్రవీణ్, రేణుక ఫోన్‌లను పోలీసులు ఎఫ్ఎస్ఎల్‌కు పంపారు. ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడినప్పటి నుంచి జరిగిన చాటింగ్ రికవరీ చేసే పనిలో పోలీసులు ఉన్నారు. రేణుక చెప్పినందుకే ప్రవీణ్ పేపర్ లీక్ చేసినట్టు పోలీసులు తేల్చారు. అయితే, ఇది వరకు ఏమైనా పేపర్‌లు లీక్ అయ్యాయా అనే కోణంలో కూడా పోలీసులు అరా తీస్తున్నారు. టీఎస్‌పీఎస్‌సీలో గ్రూప్ వన్ పరీక్ష పేపర్లు కూడా లీక్ అయినట్టు అనుమానాలు ఉన్నాయి.

టౌన్ ప్లానింగ్ పేపర్ లీకేజీ నిందితుడు ప్రవీణ్.. గ్రూప్ వన్ పరీక్ష రాసినట్టు తెలుస్తోంది. దాదాపుగా గ్రూప్ వన్‌లో 100కు పైగా మార్కులు సాధించినట్టు సమాచారం. అయితే, బబ్లింగ్ తప్పు చేయడం వల్ల డిస్ క్వాలిఫై అయినట్టు తెలుస్తోంది. టీఎస్‌పీఎస్‌సీలో నిర్వహించిన అన్ని పరీక్షలపై విచారణ జరిపించాలని విద్యార్థి, యువజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.