Yadagirigutta Temple: యాదాద్రి ప్రధాన ఆలయంలో ఆర్జిత సేవలు పునఃప్రారంభం

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి ప్రధాన ఆలయంలో సోమవారం నుంచి ఆర్జిత సేవలు పునఃప్రారంభం అయ్యాయి.

Yadagirigutta Temple: యాదాద్రి ప్రధాన ఆలయంలో ఆర్జిత సేవలు పునఃప్రారంభం

Yadadari

Yadagirigutta Temple: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి ప్రధాన ఆలయంలో సోమవారం నుంచి ఆర్జిత సేవలు పునఃప్రారంభం అయ్యాయి. స్వామి వారికి భక్తులు జరిపించే నిత్యకల్యాణం, వెండి మొక్కు జోడు, బ్రహ్మోత్సవం, దర్భార్ వంటి సేవలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈమేరకు ఆలయ ఈఓ గీతారెడ్డి ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వివరాలు వెల్లడించారు. ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తుల సౌకర్యార్ధం ప్రసాద విక్రయకేంద్రంలో ప్రత్యేక కౌంటర్ ద్వారా స్వామి వారి మహాప్రసాదం భక్తులకు అందుబాటులో ఉంచినట్లు ఆలయ ఈఓ వెల్లడించారు.

Also read:Amrnath Yatra: అమర్నాథ్ యాత్ర కోసం ఇప్పటి వరకు 33,795 మంది నమోదు: కొనసాగుతున్న బుకింగ్

ఇక మంగళవారం నుంచి యాదాద్రిలో సుదర్శన నరసింహ హోమం ప్రారంభిస్తున్నందున సాధారణ పూజా వేళల్లో మార్పులు చేశారు. తెల్లవారుజామున 3.30 గంటలకు స్వామి వారి సుప్రభాత సేవతో ప్రారంభమై రాత్రి 9.45కు ఆరగింపు, శయనోత్సవం అనంతరం ద్వారా బంధనం చేయనున్నారు. స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులు సమయ వేళలను గమనించి దర్శన ఏర్పాట్లు చేసుకోవాలని యాదాద్రి ఆలయ అధికారులు వెల్లడించారు.

Also read:Covid Update : తెలంగాణలో కొత్తగా 11 కోవిడ్ కేసులు నమోదు