Telangana Assembly Governor speech : టీ.సర్కార్, గవర్నర్ మధ్య కుదిరిన సయోద్య.. గవర్నర్ ప్రసంగంతో అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య సయోద్య కుదిరింది. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టడంపై సందిగ్థతకు తెర పడింది. బడ్జెట్ ను గవర్నర్ ఇప్పటివరకు ఆమోదించలేదంటూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది.

Telangana Assembly Governor speech : టీ.సర్కార్, గవర్నర్ మధ్య కుదిరిన సయోద్య.. గవర్నర్ ప్రసంగంతో అసెంబ్లీ సమావేశాలు

Assembly

Telangana Assembly Governor speech : తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య సయోద్య కుదిరింది. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టడంపై సందిగ్థతకు తెర పడింది. బడ్జెట్ ను గవర్నర్ ఇప్పటివరకు ఆమోదించలేదంటూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. హైకోర్టు సూచన మేరు ఇటు ప్రభుత్వం, ఆటు రాజ్ భవన్ తరపు న్యాయవాదులు చర్చలు జరిపి ఓ పరిష్కారానికి వచ్చారు. అసెంబ్లీ సమావేశాల రాజ్యాంగ బద్ధ నిర్వహణకు నిర్ణయించుకున్నామని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. రాజ్యాంగం ప్రకారం వ్యవహరిస్తామని చెప్పారు. ఇటు రాజ్యాంగ బద్దంగా గవర్నర్ తన విధులు నిర్వహిస్తారని రాజ్ భవన్ తరుపు న్యాయవాది తెలిపారు. అంతకముందు 2023-24 బడ్జెట్ ను శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుండగా అందుకు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలపకపోవడంపై అధికార వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

Governor Tamilisai : తెలంగాణ సర్కార్ పై మరోసారి గవర్నర్ తమిళిసై విమర్శలు

మరో నాలుగు రోజులే సమయం ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. జనవరి 21న బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం.. గవర్నర్ అనుమతి కోరింది. ఆ తర్వాత ఈనెల 26న గవర్నర్ ను కలిసి బడ్జెట్ ను అనుమతించాలని ఫైనాన్స్ చీఫ్ సెక్రటరీ కోరారు. ఆ మరుసటి రోజు అంటే జనవరి 27న గవర్నర్ కు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు.

అదే రోజు గవర్నర్ కూడా తిరిగి ప్రభుత్వానికి మరో లేఖ రాశారు. సభలో తన ప్రసంగం ఉందా? లేదా అని లేఖలో పేర్కొన్నారు. ఇవాళ హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. మధ్యాహ్నం సమయంలో హైకోర్టులో ప్రభుత్వం, గవర్నర్ తరపు న్యాయవాదులు వాడివేడి వాదనలు వినిపించారు. లంచ్ తర్వాత ఇరు వర్గాలకు హైకోర్టు రాజీ కుదుర్చింది. రాజ్యాంగబద్ధంగా వ్యవహరించడానికి తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ అంగీకరించారు.