అస్సోంలో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ బీభత్సం..14వేల పందులు మృతి

  • Published By: nagamani ,Published On : May 12, 2020 / 10:42 AM IST
అస్సోంలో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ బీభత్సం..14వేల పందులు మృతి

భారత్ లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. మరోపక్క అసోంలో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ బీభత్సం సృష్టిస్తోంది. ఈ ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ బారిన పడి రాష్ట్రంలోని పది జిల్లాల్లో 13వేలకు పైగా పందులు మృతి చెందాయి. ఈ సంఖ్య తాజాగా చూస్తే 14వేలు దాటినట్లుగా తెలుస్తోంది.  ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పందుల పెంపకందారులను రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. చనిపోయిన పందులను వెంటనే  లోతైన గుంతలో పూడ్చిపెట్టాలని ఆదేశాలు జారీ చేసింది. అలా చేయకుంటే..ఆ వైరస్ ఇతర జంతువులకూ వ్యాపించి అవికూడా మృత్యువాత పడే ప్రమాదముందని హెచ్చరించింది.

దీనిపై అసోం పశు సంవర్ధకశాఖ మంత్రి అతుల్ బోరా మాట్లాడుతూ..రాష్ట్రంలో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. కాగా… ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ ఒక రకమైన జ్వరం తెప్పించే వైరస్. ఇది మనుషులకు వచ్చే స్వైన్ ఫ్లూ లాంటిది కాదనీ..దానికీ దీనికి ఏమాత్రం సంబంధం లేదని తెలిపారు. ఆఫ్రికా స్వైన్ ఫ్లూ సోకిన పందులు చనిపోయేదాకా వదలదనీ అలా వైరస్ సోకిన పందులు వారం రోజుల్లో చనిపోతాయని తెలిపారు.భారతదేశంలో ప్రస్తుతం 30 లక్షల దాకా పందులు ఉంటాయని అంచనా. అసోంలో వైరస్ సోకిన పందులన్నీ చచ్చిపోతున్నాయి. ఆఫ్రికా స్వైన్ ఫ్లూ అనే వైరస్ పంది తినే ఆహారం, దాని లాలాజలం, రక్తం, రక్తనాళాల ద్వారా ఇతర పందులకు వ్యాపిస్తుంది. ఈ క్రమంలో మిగతా పందులకు, ఇతర జంతువులకు ఈ వైరస్ సోకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఓ వైపు కరోనాతో పోరాడుతూనే.. మరోవైపు ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూను కట్టడిచేసేందుకు అసోం ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోంది. 

అలాగే అస్సాంలో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ బీభత్సం సృష్టిస్తున్న క్రమంలో మంత్రి అతుల్ బోరా కాజీరంగ జాతీయ ఉద్యానవనాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. కాజీరంగా నేషనల్ పార్క్ అధికారులు అగోరటోలి రేంజ్‌లో కాలువను తవ్వి అడవి పందులను సమీప గ్రామాలకు వెళ్ళకుండా నిరోధించడానికి, వాటిని వ్యాధి నుండి కాపాడటానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.  

Read Here>>మెంటల్ హెల్త్‌పై ప్రభావం చూపిస్తున్న NEW LOCKDOWN రూల్స్