Ts government: తెలంగాణలో కొవిడ్‌ తర్వాత.. ఆ రెండు సమస్యలతో బాధపడేవారి సంఖ్య పెరిగిందా..!

ప్రపంచ దేశాలను రెండేళ్లు వణికించిన కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తోంది. ఉత్తర కొరియా, చైనా మినహా మిగిలిన దేశాల్లో వైరస్ వ్యాప్తి తగ్గిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. భారత్‌లో కొవిడ్ అదుపులోనే...

Ts government: తెలంగాణలో కొవిడ్‌ తర్వాత.. ఆ రెండు సమస్యలతో బాధపడేవారి సంఖ్య పెరిగిందా..!

Telangana

Ts government: ప్రపంచ దేశాలను రెండేళ్లు వణికించిన కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తోంది. ఉత్తర కొరియా, చైనా మినహా మిగిలిన దేశాల్లో వైరస్ వ్యాప్తి తగ్గిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. భారత్‌లో కొవిడ్ అదుపులోనే ఉంది. శుక్రవారం కేంద్రం ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. 16వందల లోపే పాజిటివ్ కేసులు నమోదయ్యయి. ఇక తెలంగాణలో కొవిడ్ తీవ్రత తగ్గింది. అయితే కరోనా తరువాత నిర్వహించిన పలు సర్వేల్లో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కరోనా సోకి కోలుకున్న వ్యక్తులు పలు రకాల సమస్యలతో బాధపడుతున్నట్లు ఇప్పటికే పలు సర్వేలు వెల్లడించాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న అసంక్రమిత వ్యాధుల నిర్ధారణ పరీక్షల్లో ఆసక్తికర విషయాలు వెల్లడవుతున్నాయి.

Coronavirus: జూన్‌లో తెలంగాణలో గరిష్ట స్థాయికి కొవిడ్ కేసులు.. ఆరోగ్యశాఖ అంచనా ప్రకారం..

తెలంగాణ రాష్ట్రంలోని 30ఏండ్లు పైబడిన వారందరికీ క్షేత్రస్థాయిలో వైద్యసిబ్బంది నాన్ కమ్యూనికబుల్ డీసీజెస్ (ఎన్సీడీ) స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1.05 కోట్లమంది (ఎన్సీడీ)కి ఎన్రోల్ చేసుకోగా.. 90 లక్షల మందికి పరీక్షలు పూర్తయ్యాయి. పరీక్షల వివరాలను కాంప్రహెన్సివ్ ప్రైమరీ హెల్త్ కేర్ (సీపీహెచ్‌సీ) పోర్టల్ లో పొందుపర్చుతున్నారు. ఈ గణాంకాల ప్రకారం.. తెలంగాణలో కరోనా తరువాత 14.4శాతం(12,96,887) మంది హైపర్ టెన్షన్ తో బాధపడుతున్నట్లు వెల్లడైంది. సుమారు 6.6(5,94,866) శాతం మంది డయాబెటీస్ బారిన పడినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కోవిడ్ ముందుతో పోల్చితే బీపీ, షుగర్ బాధితుల సంఖ్య పెరిగినట్లు వెల్లడైంది.

Telangana Covid Bulletin Update : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే..

2017- 19 మధ్య దశలవారీగా నిర్వహించిన ఎన్సీడీ స్క్రీనింగ్ లో మొత్తం 12శాతం మంది హైపర్ టెన్షన్, 5.33 శాతం మంది మధుమేహ బాధితులు ఉండగా.. ప్రస్తుతం నిర్వహించిన పరీక్షల్లో ఈ రెండు సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య పెరిగింది. దీనికి ప్రధాన కారణం.. కొవిడ్ సమయంలో శారీరక శ్రమ పూర్తిగా తగ్గిపోవడం, వర్క్ ఫ్రమ్ హోంతో జీవనశైలిలో మార్పులు, ఆహార అలవాట్లలో మార్పు, ఉద్యోగాలు కోల్పోవడం, ఆర్థిక నష్టాలు వల్ల ఒత్తిడి వంటి కారణాలతో బాధితుల సంఖ్య పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు.