CM KCR : మళ్లీ మా ప్రభుత్వమే వస్తుంది.. కేసీఆర్ కాన్ఫిడెన్స్

తెలంగాణలో రానున్న ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీనే గెలుస్తుందని, మళ్లీ తమ ప్రభుత్వమే వస్తుందని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ అన్నారు. ''కొందరు అధికారంలోకి వస్తామని కలలు కంటున్నారు. ఎవర్

CM KCR : మళ్లీ మా ప్రభుత్వమే వస్తుంది.. కేసీఆర్ కాన్ఫిడెన్స్

Cm Kcr

CM KCR : తెలంగాణలో రానున్న ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీనే గెలుస్తుందని, మళ్లీ తమ ప్రభుత్వమే వస్తుందని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ అన్నారు. ”కొందరు అధికారంలోకి వస్తామని కలలు కంటున్నారు. ఎవర్ని ప్రభుత్వంలో ఉంచాలో ప్రజలకు బాగా తెలుసు. మాకు అంచనాలు, సర్వేలు ఉన్నాయి. మా ప్రభుత్వమే కొనసాగుతుంది. ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తుంటే ప్రజలు మమ్మల్ని ఎందుకు పక్కన పెడతారు? ఏ కారణంతో పక్కన పెడతారు? మాకు ఆత్మవిశ్వాసం ఉంది” అని కేసీఆర్ అన్నారు.

Facebook Outage : ఆమె లైవ్‌లో కనిపించింది అంతే.. క్షణాల్లో ఫేస్‌బుక్ సర్వీసులన్నీ బంద్..!

ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు దళితబంధు కేవలం హుజూరాబాద్ కోసమే పెట్టలేదని కేసీఆర్ స్పష్టం చేశారు. ” దళితబంధు హుజూరాబాద్ కోసం తీసుకొచ్చింది కాదు. 1986లోనే ఈ పథకం పురుడుపోసుకుంది. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు దళితుల పరిస్థితి దయనీయంగా ఉంది. 75 ఏళ్ల స్వాతంత్ర్యం తర్వాత కూడా దళితుల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదు. స్వాతంత్ర్యానికి ముందు కూడా హింసకు గురయ్యారు. అవకాశాలు లేక దళితులు సతమతమవుతున్నారు. మేం ఇప్పటివరకు కొంతమేర చేయగలిగాము. దళితబంధుపై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయి. ఎస్సీ కార్పొరేషన్ తో బాగుపడ్డోడు ఒక్కడూ లేడు. భూములు అమ్ముతుంటే రాష్ట్రానికి మంచి ఆదాయం వస్తోంది. వచ్చే బడ్జెట్‎లో దళితబంధుకు రూ.20 వేల కోట్లు కేటాయిస్తాం. నియోజకవర్గానికి 100 మంది లబ్దిదారులను ఎంపిక చేయడం ఎమ్మెల్యేల ఇష్టమే’ అని దళితబంధుపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ అన్నారు.

Blood Thinners: రక్తాన్ని పలుచగా చేసే ఇవి..50 శాతం కరోనా మరణాలు తగ్గిస్తున్నాయి : తాజా పరిశోధనలో వెల్లడి

ప్రతి ఎస్సీ కుటుంబానికి దళితబంధు..
ప్రభుత్వ లైసెన్స్ అవసరమయ్యే వ్యాపారాల్లో ఎస్సీలకు రిజర్వేషన్లు అమలు చేస్తాం. ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులకు దళితబంధు ఇచ్చాం. ఎస్సీ ప్రభుత్వ ఉద్యోగికి కూడా ఈ పథకం వర్తింపజేస్తాం. రాష్ట్రంలోని అన్ని ఎస్సీ కుటుంబాలకు దళితబంధు ఇస్తాం. ఓటు ఎవరికైనా వేసుకోవచ్చు. దళితబంధుతో ముడిపెట్టం. పార్టీలకు అతీతంగా లబ్ధిదారులు ఎంపిక ఉంటుంది. ప్రతి ఎస్సీ కుటుంబానికి దళితబంధు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. హైదరాబాద్‌ మినహా ప్రతి జిల్లాలో దాదాపు 20 శాతం ఎస్సీలు ఉన్నారు. రాష్ట్రంలో సగటున 17.53 శాతం ఎస్సీల జనాభా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఎస్సీ రిజర్వేషన్‌ పెంచాలి. కుల గణన జనాభా లెక్కలు జరగాల్సిందే. ఇందుకోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపుతాం. ఎస్సీ రిజర్వేషన్‌ వర్గీకరణ కోసం ఎన్నోసార్లు తీర్మానం చేసి పంపించాం. ఎన్ని తీర్మానాలు చేసినా కేంద్రం పట్టించుకోవడం లేదు అని కేసీఆర్ అన్నారు.

ఎస్సీ రిజర్వేషన్లు పెంచాలి..
ఎస్సీ రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం పెంచాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. ”రాష్ట్రంలో 17.53శాతం ఎస్సీల జనాభా ఉంది. అత్యధికంగా మంచిర్యాలలో 26.64 శాతం, అత్యల్పంగా హైదరాబాద్ లో 17శాతం ఎస్సీ జనాభా ఉంది. అలాగే బీసీ కుల గణన జనాభా లెక్కలు జరగాల్సిందే. కులగణన కోసం అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపుతాం” అని కేసీఆర్ అన్నారు.