KA Paul On Agnipath : దేశం మండిపోతోంది, కేసీఆర్ ప్రభుత్వం విఫలమైంది-కేఏ పాల్ ఫైర్

శాంతి భద్రతలు కాపాడటంలో కేసీఆర్ ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. ఇంత పెద్దఎత్తున ఆందోళనలు జరుగుతుంటే కేసీఆర్ శాంతిభద్రతలు కాపాడరా? అని ప్రశ్నించారు.

KA Paul On Agnipath : దేశం మండిపోతోంది, కేసీఆర్ ప్రభుత్వం విఫలమైంది-కేఏ పాల్ ఫైర్

Ka Paul On Agnipath

KA Paul On Agnipath : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో చోటు చేసుకున్న విధ్వంసకాండపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్రంగా స్పందించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపైన, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపైనా ఆయన సీరియస్ అయ్యారు. కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ స్కీమ్ తో దేశం మండిపోతోందని కేఏ పాల్ అన్నారు.

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో పోలీసుల కాల్పుల్లో ఒక యువకుడు మృతి చెందడం బాధాకరం అన్నారు. ఈ ఘటనను ఆయన ఖండించారు. కేసీఆర్ ప్రభుత్వంపైనా పాల్ విరుచుకుపడ్డారు. శాంతి భద్రతలు కాపాడటంలో కేసీఆర్ ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. ఇంత పెద్దఎత్తున ఆందోళనలు జరుగుతుంటే కేసీఆర్ శాంతిభద్రతలు కాపాడరా? అని ప్రశ్నించారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

తెలంగాణ పోలీసులు, హోంమంత్రి ఏం చేస్తున్నారని నిలదీశారు. యువకులపై దాడి దురదృష్టకరం, బాధాకరం అని వాపోయారు. తెలంగాణలో శాంతిభద్రతలు లేవన్న కేఏ పాల్.. 30పైగా అత్యాచారాలు జరిగాయన్నారు. రాష్ట్రంలో కేసీఆర్, దేశంలో మోదీ ఫెయిల్యూర్ అయ్యారని విమర్శించారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నాశనం కావడానికి వారు చేసిన అవినీతే కారణం అన్నారు కేఏ పాల్. బీజేపీ వచ్చిన తర్వాత దేశం బాగుపడుతుందని అనుకుంటే, అంతకన్నా ఎక్కువగా పాడవుతోందని వాపోయారు.

Agnipath : ఆర్మీ జవాన్‌ కావాలని కలలుకన్న యువకుడు ‘అగ్నిపథ్’ ఆందోళనల్లో మృతి

సైనిక నియామకాల కోసం కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ స్కీమ్ ను రద్దు చేయాలని, ఇప్పటికే రద్దు చేసిన ఆర్మీ పరీక్షను తిరిగి పెట్టాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆర్మీ అభ్యర్థులు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఆందోళనకారులు రైల్వేస్టేషన్ ను ధ్వంసం చేయడంతో పాటు మూడు రైళ్లకు నిప్పు పెట్టారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు ఎంతో ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. దీంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడంతో… ఆందోళనకారులు పోలీసులపై రుళ్లు రువ్వారు.

Agnipath : అప్పుడు అన్నదాతలతో.. ఇప్పుడు దేశ జవాన్లతో కేంద్రం ఆడుకుంటోంది : కేటీఆర్

ఈ క్రమంలో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక యువకుడికి ఛాతీలో బుల్లెట్ దిగింది. ఈ యువకుడిని పోలీసులు హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించగా… అప్పటికే అతను మరణించినట్టు డాక్టర్లు ప్రకటించారు. ఈ ఆందోళనల్లో 11 మంది యువకులు గాయపడ్డారు. వీరందరికీ గాంధీలో చికిత్స అందిస్తున్నారు.