Yasangi Paddy Crop : యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు వేసుకోండి-నిరంజన్ రెడ్డి

కేంద్ర ప్రభుత్వాన్ని నమ్ముకుంటే రైతులు నిండా మోసపోతారని...పేద ప్రజలు, రైతుల ప్రయోజనాలను కేంద్రం పట్టించుకోవటంలేదని వ్యవసాయశాఖమంత్రి నిరంజన్ రెడ్డి   ఆగ్రహం వ్యక్తం చేశారు.

Yasangi Paddy Crop : యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు వేసుకోండి-నిరంజన్ రెడ్డి

Singireddy Niranjan Reddy

Yasangi Paddy Crop :  కేంద్ర ప్రభుత్వాన్ని నమ్ముకుంటే రైతులు నిండా మోసపోతారని…పేద ప్రజలు, రైతుల ప్రయోజనాలను కేంద్రం పట్టించుకోవటంలేదని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి   ఆగ్రహం వ్యక్తం చేశారు. యాసంగి వరి పంట నష్టపోకూడదనే ..ముందస్తుగా ప్రత్యామ్నాయ పంటలను వేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామని ఆయన రైతులను కోరారు. వానాకాలం వరి పంటను కొంటాం.యాసంగి లో ప్రత్యామ్నాయ పంటలను వేసుకుందామని ఆయన అన్నారు.

టీఆరెస్ ఎంపీలు  పార్లమెంట్ లో నిరసన వ్యక్తం చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని నిరంజన్ రెడ్డి  తెలిపారు. పార్లమెంట్ సాక్షిగా పీయూష్ గోయల్ పచ్చి అబద్ధాలు మాట్లాడారని….కేంద్ర ప్రభుత్వం కొనుగోలు వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సహకారాన్ని అందిస్తారు కానీ కొనాల్సింది మాత్రం కేంద్ర ప్రభుత్వం మాత్రమే అని ఆయన చెప్పారు. రా రైస్ కు… బాయిల్డ్ రైస్ కు తేడా తెలియని బీజేపీ ఎంపీలు ఇక్కడ ఉన్నారని దుయ్యబట్టారు.

వానాకాలం పంట కొంటున్నాం కదా అంటున్నారు…కానీ యాసంగి పంట కొంటారా లేదా చెప్పట్లేదని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. యాసంగి వడ్లు నూకలు అవుతాయి కాబట్టి బాయిల్డ్ రైస్ వస్తాయి దీన్ని కొంటారో కొనమని కేంద్రం చెపుతోంది అంటే ఈ రాష్ట్రంలో పండించే మొత్తం రైస్ తీసుకోమని చెప్పినట్లేగా అని ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు. కేంద్రం రైతుల పట్ల బాధ్యత లేకుండా వ్యవహరిస్తోందని  మంత్ర్రి విమర్శించారు.

దేశవ్యాప్తంగా పండిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన బాధ్యతను విస్మరించిన పీయూష్‌గోయల్‌ పార్లమెంటును తప్పుదారి పట్టించారని నిరంజన్ రెడ్డి  అన్నారు.  రాష్ర్టాల్లో కొనుగోలు చేసిన ధాన్యాన్ని తీసుకెళ్లాల్సిన బాధ్యత తమదేనన్న ఇంగితజ్ఞానం లేకుండా, రాష్ట్ర ప్రభుత్వంపై నెపం వేయడం దుర్మార్గమని  కేంద్రంపై మండిపడ్డారు. ధాన్యం కొనుగోళ్లు, మి ల్లింగ్‌, ఎగుమతి అంతా ఎఫ్‌సీఐ బాధ్యతేనని నిరంజన్ రెడ్డి  స్పష్టం చేశారు.
Also Read : Rythu Bandhu : రైతుల‌కు శుభ‌వార్త‌.. డిసెంబర్ 15 నుంచి ఖాతాల్లోకి డబ్బులు..!
రాజకీయాల కోసం రైతులను,ప్రజలను బీజేపీ మోసం చేస్తోందని ఆయన అన్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్ పార్టీకి రైతుల దీక్షలు కనిపించట్లేదని నిరంజన్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వ తీరును పసిగట్టే ముఖ్యమంత్రి కేసీఆర్ రైతాంగాన్ని ప్రత్యామ్నాయపంటలవైపు మళ్ళిస్తూ వస్తున్నారని ఆయన తెలిపారు.

వానాకాలం లో అకాల వర్షాల వలన దాన్యం తడిస్తే కూడా కొనుగోలు చేస్తున్నామని…రంగు మారిన దాన్యంను కొనుగోలు చేస్తున్నామని… రంగు మారిన, తడిసిన దాన్యంకు కూడా మద్దతు ధర కల్పిస్తున్నమని నిరంజన్ రెడ్డి చెప్పారు.ఎట్టిపరిస్థితుల్లోనూ యాసంగిలో రైతులు వరి వేస్తే ప్రభుత్వం కొనుగోలు చేయదు…. మీరు వేసుకుంటే మీ ఇష్టం….విత్తనాల కోసం ఇతర అవసరాలకు మీరు వరి వేసుకోవచ్చుఅని మంత్రి సూచించారు.