Ministry of Agriculture: యాసంగి సీజన్‌లో వరి వేయొద్దు.. ప్రభుత్వం కొనలేదు -వ్యవసాయ మంత్రి

యాసంగి వరి పంట విషయంలో ప్రభుత్వ విధానాన్ని స్పష్టం చేశారు వ్యవసాయ శాఖ మంత్రి నీరంజన్ రెడ్డి.

Ministry of Agriculture: యాసంగి సీజన్‌లో వరి వేయొద్దు.. ప్రభుత్వం కొనలేదు -వ్యవసాయ మంత్రి

Niranjan Reddy

Ministry of Agriculture: యాసంగి వరి పంట విషయంలో ప్రభుత్వ విధానాన్ని స్పష్టం చేశారు వ్యవసాయ శాఖ మంత్రి నీరంజన్ రెడ్డి. ఎట్టి పరిస్థితుల్లో రైతులు యసంగి సీజన్‌లో వరి వేయొద్దు అన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. యాసంగి వరికి బదులు ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్లాలని సూచించారు. సీడ్ కంపెనీలతో ఒప్పందం ఉన్న వాళ్ళు వరి పంట వేసుకుంటే ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు నిరంజన్ రెడ్డి. ఏడేళ్లలో తెలంగాణ వ్యవసాయ రంగంలో నిర్దిష్టమైన ప్రగతి సాధించిందన్నారు నిరంజన్ రెడ్డి.

యాసంగి పంట సమయంలో తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయమని చెప్పిన నిరంజన్ రెడ్డి.. వానాకాలంలో పండించిన వరిని మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం, ఎఫ్‌సీఐ బాయిల్డ్ రైస్‌ను కొనుగోలు చేయమని చెప్పిందని, తెలంగాణ ప్రభుత్వం కూడా యాసంగి వడ్లను కొనుగోలు చేసే పరిస్థితి లేదన్నారు. యాసంగిలో ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు దృష్టి పెట్టాలని అన్నారు.

ఎవరైతే మిల్లర్లతో, సీడ్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్న రైతులు ఉంటే వారు నిరభ్యంతరంగా వరిసాగు చేసుకోవచ్చని అన్నారు. తెలంగాణ వచ్చేనాటికి 22లక్షల వ్యవసాయ పంపు సెట్లు ఉంటే, అవి ఇప్పుడు ముప్పై లక్షలకు చేరుకున్నాయని అన్నారు నిరంజన్ రెడ్డి. వానాకాలంలో పంటలు ఒక కోటి యాబై లక్షలకుపైగా ఉంటే వరి 62లక్షల ఎకరాల్లో సాగైందని అన్నారు.

ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేశారు మంత్రి నిరంజన్ రెడ్డి. యాసంగి ధాన్యం కొంటామని లిఖితపూర్వకంగా కేంద్రం నుంచి హామీ తేవాలని బీజేపీ నేతలకు మంత్రి నిరంజన్ రెడ్డి సవాల్ విసిరారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ నల్లచట్టల్లో భాగమే ఇదేనన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి.