Congress Bakka Jedson : తెలంగాణలో మిషన్ భగీరథ అతిపెద్ద కుంభకోణం : కాంగ్రెస్ నేత బక్క జెడ్సన్

తెలంగాణలో 48 శాతం మిషన్ భగీరథ పనులు పాత లైన్లను ఉపయోగించుకుని జరిగాయని పేర్కొన్నారు. కానీ 100 శాతం తాగు నీరు మిషన్ భగీరథ వల్లనే సరఫరా చేస్తున్నామంటూ కేసీఆర్ చెప్తున్నారని తెలిపారు.

Congress Bakka Jedson : తెలంగాణలో మిషన్ భగీరథ అతిపెద్ద కుంభకోణం : కాంగ్రెస్ నేత బక్క జెడ్సన్

Bakka Jedson

AICC member Bakka Jedson : తెలంగాణలో మిషన్ భగీరథ అతిపెద్ద కుంభకోణం అని ఏఐసీసీ సభ్యుడు బక్క జెడ్సన్ విమర్శించారు. మిషన్ భగీరథ కుంభకోణంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేశారు. మే 5వ తేదీ కేంద్ర జలశక్తి శాఖ గ్రీవియన్స్ సెల్ విభాగానికి ఆన్ లైన్ ద్వారా ఫిర్యాదు చేశారు. తెలంగాణలో అన్ని కుంభకోణాలకు మిషన్ భగీరథ మూలం అని ఆరోపించారు.

తెలంగాణలో 48 శాతం మిషన్ భగీరథ పనులు పాత లైన్లను ఉపయోగించుకుని జరిగాయని పేర్కొన్నారు. కానీ 100 శాతం తాగు నీరు మిషన్ భగీరథ వల్లనే సరఫరా చేస్తున్నామంటూ కేసీఆర్ చెప్తున్నారని తెలిపారు. ప్రాథమిక అంచనాల ప్రకారం 46,123 కోట్లుగా మిషన్ భగీరథ అంచనా వ్యయంగా చెప్పారని పేర్కొన్నారు. 2.72 కోట్ల మందికి మిషన్ భగీరథ ద్వారా తాగు నీరు సరఫరా చేస్తున్నామని కేసీఆర్ ప్రభుత్వం ప్రకటించిందన్నారు.

Revanth Reddy : కేసీఆర్ కు రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టే : రేవంత్ రెడ్డి

ప్రభుత్వ లెక్కల ప్రకారం 2.16 కోట్ల మందికి మాత్రమె నీటి సరఫరా జరుగుతుందని తెలిపారు. మిషన్ భగీరథ కోసం నాసి రకం పైపులు ఉపయోగించారని ఆరోపించారు. గతంలో కేంద్ర ప్రభుత్వ గ్రామీణ నీటిసరఫరా పథకం కింద నిర్మించిన పైపు లైన్లు, నీటి ట్యాంకులను మిషన్ భగీరథ కోసం వినియోగించారని పేర్కొన్నారు.

గత కేంద్ర ప్రభుత్వ పథకంలో వేసిన దాదాపు 60 శాతం పైపు లైన్లు, వాటర్ ట్యాంకులు, చెరువులను మిషన్ భగీరథ కోసం వినియోగించారని వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే ఉన్న బోర్ వెల్స్ ను మిషన్ భగీరథ కిందకు చేర్చి తమ గొప్పగా చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు.