Liquor in Telangana: తెలంగాణలో మద్యం అధికంగా సేవిస్తున్న వారిలో ఆ జిల్లానే టాప్

తెలంగాణ వ్యాప్తంగా మద్యం వినియోగం, మద్యపానం సేవించే వారి సంఖ్య వంటి ఇతర గణాంకాలు గతంలోకంటే భారీగా పెరిగినట్లు ఇటీవల ప్రకటించిన ఓ నివేదికలో వెల్లడైంది

Liquor in Telangana: తెలంగాణలో మద్యం అధికంగా సేవిస్తున్న వారిలో ఆ జిల్లానే టాప్

Wines

Liquor in Telangana: తెలంగాణ వ్యాప్తంగా మద్యం వినియోగం, మద్యపానం సేవించే వారి సంఖ్య వంటి ఇతర గణాంకాలు గతంలోకంటే భారీగా పెరిగినట్లు ఇటీవల ప్రకటించిన ఓ నివేదికలో వెల్లడైంది. తెలంగాణ ప్లానింగ్ డిపార్టుమెంటు రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేపట్టి ఓ నివేదిక రూపొందించింది. ఈక్రమంలో రాష్ట్రంలోనే అత్యధికంగా మద్యం వినియోగం జనగామ జిల్లాలో ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు. 60.6 శాతం మంది మద్యం ప్రియులతో జనగామ జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉండగా..58.4 శాతంతో యాదాద్రి భువనగిరి జిల్లా, 56.5 శాతంతో మహబూబాబాద్ జిల్లాలు రెండు, మూడు స్థానాల్లో ఉన్నట్లు నివేదికలో వెల్లడించారు. తెలంగాణ వ్యాప్తంగా మద్యం సేవించేవారి సంఖ్య సగటున 43.3 శాతంగా ఉండగా..22 జిల్లాల్లో రాష్ట్ర సగటు కంటే ఎక్కువ మంది మద్యం సేవించేవారు ఉన్నట్లు అధికారులు నివేదికలో పేర్కొన్నారు.

Also read:Gold-Silver Prices : స్థిరంగా బంగారం ధరలు.. భారీగా తగ్గిన వెండి..!

అయితే ఎక్కువ జనాభా కలిగిన హైదరాబాద్ జిల్లాను కాదని మిగతా జిల్లాల్లో మద్యం వినియోగం పెరగడం కొసమెరుపు. హైదరాబాద్‌‌ అర్బన్ పరిధిలో కేవలం 28 శాతం మంది మాత్రమే మద్యం సేవించే వారు ఉన్నట్లు ప్లానింగ్ డిపార్టుమెంట్ నివేదికలో పేర్కొంది. ఇటీవల కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో మద్యం దుకాణాల సంఖ్య పెరగటం, ఎక్కడంటే అక్కడ బెల్ట్‌‌ షాపులు పుట్టుకురావడంతో రూరల్ జిల్లాల్లో మద్యం సేవించే వారి సంఖ్య పెరుగుతున్నట్లు అధికారులు విశ్లేషించారు. తెలంగాణ రాష్ట్రంలో మద్యం సేవించే మహిళల సంఖ్య కూడా ఇటీవల కాలంలో పెరిగినట్లు నివేదికలో పేర్కొన్నారు. రాష్ట్రంలో సగటున ప్రతి 100 మందిలో ఏడుగురు మహిళలు మద్యం సేవిస్తున్నారు. మెదక్‌‌ జిల్లాలో అత్యధికంగా 23.8 శాతం మంది మహిళలు మద్యం సేవిస్తున్నారు.

Also read:petrol, diesel price today :ఇంధన ధరల దూకుడుకు బ్రేక్.. గుంటూరులో మినహా..