మందుబాబుల ముందు జాగ్రత్త.. లిక్కర్ సేల్స్ పెరిగిపోతున్నాయ్

మందుబాబుల ముందు జాగ్రత్త.. లిక్కర్ సేల్స్ పెరిగిపోతున్నాయ్

వారం రోజులుగా సేల్స్ పెరిగిపోయాయి. హైదరాబాద్ లో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో లాక్‌డౌన్ దాదాపు ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. త్వరలోనే అమలు చేయనున్నట్లు రూమర్లు వ్యాప్తి చెందడంతో మందుబాబులు ముందుగా జాగ్రత్త పడుతున్నారు. కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి జనతా కర్ఫ్యూ విధించిన మరుసటి రోజు నుంచే లాక్ డౌన్ అమలు చేసింది తెలంగాణ ప్రభుత్వం.

దీంతో లిక్కర్ దొరక్క నానా తంటాలు పడ్డారు. నెలల తరబడి మందు దొరక్కపోవడంతో లాక్‌డౌన్ సడలించగానే ఒక్కసారిగా షాపుల మీద పడ్డారు. సిటీలో కరోనా కేసులు పెరిగిపోతున్న క్రమంలో మళ్లీ అలాంటి పరిస్థితి రాకూడదని స్టాకులు పోగేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే గత వారం విపరీతమైన కలెక్షన్లు వచ్చాయని వైన్ షాప్ నిర్వాహకులు అంటున్నారు.

మార్చి 22 నుంచి మే 6వరకూ విధించిన లాక్‌డౌన్ పరిస్థితులు వస్తే ఎదుర్కోవడానికి ఇతరుల కంటే ఎక్కువగా మందుబాబులకే ముందుజాగ్రత్త ఎక్కువగా ఉంది.

Read Here>>కరోనా నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీల‌క నిర్ణ‌యం, ఈ-ఆఫీస్ ద్వారా పరిపాలన