TRS Plenary : టీఆర్‌ఎస్‌ ప్లీనరీ వేడుకలకు ముస్తాబవుతోన్న భాగ్యనగరం..ఫ్లెక్సీలు, భారీ బ్యానర్ల ఏర్పాటు

టీఆర్‌ఎస్‌ ద్విదశాబ్ధి ఉత్సవ వేడుక ప్లీనరీకి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.. హైదరాబాద్‌లోని హైటెక్స్‌ వేదికగా సోమవారం జరిగే ప్లీనరీ కోసం చకాచకా ఏర్పాట్లు చేస్తున్నారు.

TRS Plenary : టీఆర్‌ఎస్‌ ప్లీనరీ వేడుకలకు ముస్తాబవుతోన్న భాగ్యనగరం..ఫ్లెక్సీలు, భారీ బ్యానర్ల ఏర్పాటు

Trs

arrangements for the TRS Plenary : టీఆర్‌ఎస్‌ ద్విదశాబ్ధి ఉత్సవ వేడుక ప్లీనరీకి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.. హైదరాబాద్‌లోని హైటెక్స్‌ వేదికగా సోమవారం జరిగే ప్లీనరీ కోసం చకాచకా ఏర్పాట్లు చేస్తున్నారు.. ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ ప్రతినిధులతో పాటు మొత్తం ఆరు వేల మంది తరలిరానున్నారు..

పార్కింగ్‌ నుంచి సభా వేదిక దాకా అన్ని ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి.. పార్లమెంట్‌ సమావేశాలు, కరోనా కారణంగా మూడేళ్ల పాటు ప్లీనరీ సమావేశాలు జరగలేదు.. దీంతో ఈ సారి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాయి గులాబీ శ్రేణులు.. ఈ సమావేశాల్లో పార్టీ అధ్యక్షుడి ఎన్నిక కూడా జరగనుంది. 10వ సారి కూడా కేసీఆర్‌ను పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోవడం లాంఛనం కానుంది..

TRS : అక్టోబర్ 25న టీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక

ఇప్పటికే గ్రేటర్‌ గులాబీమయమైంది.. హైదరాబాద్‌లోని ప్రధాన జంక్షన్లలో సీఎం కేసీఆర్‌ నిలువెత్తు కటౌట్లు, సంక్షేమ పథకాలను వివరించే ఫ్లెక్సీలు వెలిశాయి.. ఈ ప్లీనరీలో ప్రపంచ రికార్డును నెలకొల్పడమే లక్ష్యంగా సరికొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్నారు. 20 మీటర్ల వెడల్పు కాన్వాస్‌పై ప్రముఖ శాండ్‌ ఆర్టిస్ట్‌ కాంత్‌ రిసా.. 20 ఏండ్ల టీఆర్‌ఎస్‌ ప్రస్థానాన్ని వివరిస్తూ చిత్రాలు గీయనున్నారు. దీనికి సంబంధించిన పనులు ఈ రోజు ప్రారంభం కానున్నాయి..

ఇక కోట ద్వారాన్ని తలపించేలా భారీ ప్రవేశ ద్వారం.. వివిధ రకాల థీమ్‌లతో ఎల్‌ఈడీ ధగధగలు..కళ్లకు కట్టేలా వేలాది ఫొటోలతో ఉద్యమ సారథి సీఎం కేసీఆర్‌ జీవిత చరిత్ర.. ఏడేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమంపై ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్లీనరీలో ఏర్పాటు చేయనున్నారు.. 150 మీటర్ల వెడల్పు, 40 ఫీట్ల ఎత్తులో భారీ ప్రవేశ ద్వారం ఏర్పాటు చేస్తున్నారు.. ఇక ప్లీనరికి వచ్చే 6 వేల మంది టీఆర్‌ఎస్‌ నేతల కోసం 29 రకాల ప్రత్యేక వంటకాలు సిద్ధం చేయనున్నారు..

KTR on Eetala Revanth: ఈటల, రేవంత్.. ఓ హోటల్‌లో కలిశారు.. కావాలంటే ఆధారాలు చూపిస్తా: కేటీఆర్

ప్లీనరీ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌.. వచ్చె నెల 15న వరంగల్‌లో నిర్వహించనున్న తెలంగాణ విజయగర్జన బహిరంగసభకు లక్షలాదిగా తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. నిన్న తెలంగాణ భవన్‌లో 20 నియోజకవర్గాల నేతలతో సమావేశమై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. విజయగర్జన సభకు ప్రతి గ్రామం నుంచి గులాబీ దండు బయలుదేరాలని సూచించారు..