Exams Postponed : అన్ని పరీక్షలు వాయిదా, ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

విద్యా సంస్థలు(ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు) తాత్కాలికంగా మూసేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా అన్ని పరీక్షలు...

Exams Postponed : అన్ని పరీక్షలు వాయిదా, ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

Exams Postponed

Exams Postponed : తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. మరోసారి రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా స్కూల్ విద్యార్థులు కోవిడ్ బారిన పడుతున్నారు. ఈ క్రమంలో విద్యా సంస్థలు(ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు) తాత్కాలికంగా మూసేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా అన్ని యూనివర్సిటీల్లోనూ డిగ్రీ, పీజీ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి చెప్పింది.

తెలంగాణలో డిగ్రీ, పీజీ పరీక్షలు వాయిదా పడ్డాయి. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా అన్ని యూనివర్సిటీల పరిధిలో ప్రస్తుతం జరుగుతున్న సెమిస్టర్‌ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ పాపిరెడ్డి వెల్లడించారు. విద్యార్థులు, టీచర్ల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీకున్నామన్నారు. ఈ మేరకు అన్ని విశ్వవిద్యాలయాలకు ఆదేశాలు జారీ చేశారు. సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత పరీక్షలను రీషెడ్యూల్‌ చేస్తామని పాపిరెడ్డి చెప్పారు.

రాష్ట్రంలో కరోనా తీవ్రత దృష్ట్యా ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలను మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రస్తుతం జరుగుతున్న పరీక్షలు యథాతథంగా కొనసాగుతాయని ఆయా యూనివర్సిటీలు నిన్న(మార్చి 23,2021) ప్రకటించాయి. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సమీక్ష నిర్వహించిన ఉన్నత విద్యామండలి.. సెమిస్టర్‌ పరీక్షలను వాయిదా వేయాలని యూనివర్సిటీలకు సూచించింది.

తెలంగాణలో డేంజర్ బెల్స్ :
తెలంగాణలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ముఖ్యంగా విద్యాసంస్థలు కరోనా విస్పోటక కేంద్రాలుగా మారుతున్నాయి. దీంతో అలర్ట్ అయిన ప్రభుత్వం వైరస్ కట్టడికి కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. తెలంగాణలో నిన్న(మార్చి 23,2021) ఈ ఏడాదిలోనే అత్యధిక కరోనా కేసులు నమోదవ్వడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. రాష్ట్రంలో నిన్న రాత్రి 8 గంటల వరకు 70వేల 280 కరోనా నిర్ధరణ టెస్టులు చేయగా.. 431 పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం పాజటివ్ కేసుల సంఖ్య 3,04,298కి చేరింది. నిన్న కొవిడ్‌తో ఇద్దరు మృతిచెందారు. ఇప్పటివరకు ప్రాణాలు విడిచిన వారి సంఖ్య 1,676కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 3వేల352 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.