Bypolls: ముగిసిన ఉప ఎన్నికల పోలింగ్.. ఎగ్జిట్ పోల్స్‭ ఫలితాల్లో కారుదే పైచేయి

పోలింగ్ ముగిసిన అనంతరమే సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను విడుదల చేస్తున్నాయి. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో హాట్ ఫేవరేట్‭గా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం ఉంది. కాగా, ఈ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో ఫలితాలు అధికార పార్టీ టీఆర్ఎస్‭కు అనుకూలంగానే ఉండనున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. 40-48 శాతం వరకు ఓట్ బ్యాంక్‭తో గులాబి పార్టీ గెలుస్తుందని అంచనాలు వెలువడుతున్నాయి

Bypolls: ముగిసిన ఉప ఎన్నికల పోలింగ్.. ఎగ్జిట్ పోల్స్‭ ఫలితాల్లో కారుదే పైచేయి

All exit polls predicts gain for trs

Bypolls: దేశంలోని ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. తెలంగాణలోని మునుగోడు, మహారాష్ట్రలోని తూర్పు అంధేరి, హర్యానాలోని అదాంపూర్, ఉత్తరప్రదేశ్‭లోని గోలా గోరఖ్‭నాథ్, బిహార్‭లోని గోపాల్ గంజ్ & మొకమ, ఒడిశాలొని ధాంనగర్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సాయంత్రం ఆరు గంటలకు పోలింగ్ ముగిసినట్లు ఎన్నికల సంఘం గురువారం అధికారికంగా ప్రకటించింది.

కాగా, పోలింగ్ ముగిసిన అనంతరమే సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను విడుదల చేస్తున్నాయి. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో హాట్ ఫేవరేట్‭గా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం ఉంది. కాగా, ఈ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో ఫలితాలు అధికార పార్టీ టీఆర్ఎస్‭కు అనుకూలంగానే ఉండనున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. 40-48 శాతం వరకు ఓట్ బ్యాంక్‭తో గులాబి పార్టీ గెలుస్తుందని అంచనాలు వెలువడుతున్నాయి. ఇక భారతీయ జనతా పార్టీ రెండో స్థానానికి పరిమితం కానున్నట్లు సమాచారం. కొన్ని సర్వేలు అయితే బీజేపీ మూడో స్థానానికి పరిమితం కానున్నట్లు చెబుతున్నాయి.

మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని తెలంగాణ ఎన్నికల సంఘం ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు. పోలింగ్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికీ చాలా పోలింగ్ కేంద్రాల్లో భారీ ‘క్యూ’ లైన్లు కనిపిస్తున్నాయని.. ‘క్యూ’లో ఉన్న ఓటర్లందరికీ ఓటు వినియోగించుకునే అవకాశం కల్పిస్తామని ఆయన వెల్లడించారు. ఎక్కడా రీపోలింగ్ అవసరం రాకపోవచ్చని తెలంగాణ ఎన్నికల సంఘం ప్రధానాధికారి వికాస్ రాజ్ అభిప్రాయపడ్డారు.

Munugode By Elections : మునుగోడు ఉప ఎన్నికపై 28 ఫిర్యాదులు : సీఈవో వికాస్‌ రాజ్‌