Minister KTR : ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో సర్వతోముఖాభివృద్ధి : మంత్రి కేటీఆర్

సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఏడున్నర సంవత్సరాలుగా సర్వతోముఖాభివృద్ధి జరుగుతోందని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మున్సిపాలిటీల్లో అభివృద్ధి కోసం పట్టణ ప్రగతి చేపట్టామని తెలిపారు.

Minister KTR : ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో సర్వతోముఖాభివృద్ధి : మంత్రి కేటీఆర్

Ktr (2)

telangana All-round development : ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఏడున్నర సంవత్సరాలుగా రాష్ట్రంలో సర్వతోముఖాభివృద్ధి జరుగుతోందని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మున్సిపాలిటీల్లో అభివృద్ధి కోసం పట్టణ ప్రగతి చేపడుతున్నామని తెలిపారు. 65 మున్సిపాలిటీలను 140కి పెంచినట్లు పేర్కొన్నారు. పౌరుడు కేంద్రంగా కొత్తగా మున్సిపల్ చట్టాలను తీసుకువచ్చామని తెలిపారు. పట్టణ ప్రగతి జరుగుతున్న తీరుకు రాష్ట్రానికి 12 అవార్డులు వచ్చాయని..ఇది మనకు గర్వకారణం అన్నారు.

జాతీయ స్థాయిలో తెలంగాణకు అవార్డులు రావడం గర్వించదగ్గ అంశమన్నారు. ఈ నెల 20న రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుందని పేర్కొన్నారు. పట్టణాభివృద్ధి , మున్సిపల్ శాఖలో మార్పులు రావాలని సీఎం భావిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు 65 మున్సిపాలిటీలు ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత 142 మునిసిపాలిటీలు ఏర్పాటు చేశామని తెలిపారు.

Million March : బీజేపీ మిలియన్ మార్చ్ వాయిదా

నిధుల విషయంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని స్పష్టం చేశారు. మునిసిపల్ శాఖకు రెండు వెల కోట్లకు పైగా నిధులు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన అనేక మౌలిక వసతుల్లో భాగంగా అర్బన్ మిషన్ భగీరథ కార్యక్రమాన్నీ చేపట్టినట్లు పేర్కొన్నారు. గ్రీన్ బడ్జెట్ అనే వినూత్న కార్యక్రమంలో ఏర్పాటు చేశామని చెప్పారు. బి పాస్ లాంటి చట్టలను తీసుకొచ్చినట్లు వివరించారు.

కేంద్ర గృహ నిర్మాణ శాఖ నుండి జాతీయ స్థాయిలో జరిగిన శానిటేషన్ కార్యక్రమంలో భాగంగా దేశ వ్యాప్తంగా 4వేల పట్టణాలు ఉంటే కేవలం తెలంగాణ 12 అవార్డులు వచ్చాయని తెలిపారు. ఈ నెల 20న ఢిల్లీ రాష్ట్రపతి అందిస్తారని పేర్కొన్నారు. దీని కోసం కష్ట పడ్డ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.

Kishan Reddy : ధాన్యం కొనుగోలు చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉంది : కిషన్ రెడ్డి

టాప్ స్టేట్ లో తెలంగాణ… టాప్ పట్టణాల్లో తెలంగాణలోని కొన్ని ప్రాంతాలకు అవకాశం లభించిందన్నారు. స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డ్ హైదరాబాద్ కు రావడం గర్వకారణమని తెలిపారు. సిరిసిల్ల, సిద్దిపేట, సికింద్రాబాద్ లాంటి నగరాలకు రావడం సంతోషకరమన్నారు.