Revanth Reddy : రేవంత్ రెడ్డి స్టేట్ మెంట్ ను రికార్డు చేసిన సిట్ అధికారులు

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ(TSPSC Paper Leak) కేసుపై ఆరోపణలు చేసినందుకుగానూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు గురువారం రేవంత్ రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు.

Revanth Reddy :  రేవంత్ రెడ్డి స్టేట్ మెంట్ ను రికార్డు చేసిన సిట్ అధికారులు

revanth (1)

Revanth Reddy : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ(TSPSC Paper Leak) కేసుపై ఆరోపణలు చేసినందుకుగానూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు గురువారం రేవంత్ రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. తన దగ్గరున్న ఆధారాలను సిట్ అధికారులకు రేవంత్ సమర్పించారు. రేవంత్ స్టేట్ మెంట్ ను సిట్ అధికారులు రికార్డు చేశారు.

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అంటూ ఆరోపణలు చేస్తున్నవారికి సిట్ నోటీసులు ఇస్తోంది. ఇందులో భాగంగా గ్రూప్-1 ప్రశ్నాపత్రం లీక్ పై ఆరోపణలు చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy)కి మార్చి20న సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరు కావాలని, పేపర్ లీక్ కేసుకు సంబంధించి తన దగ్గరున్న ఆధారాలు ఇవ్వాలంటూ రేవంత్ కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి గురువారం సిట్ విచారణకు హాజరయ్యారు.

Revanth Reddy : సిట్ నోటీసులకు భయపడను.. కేటీఆర్ కు కూడా నోటీసులు ఇవ్వాలి : రేవంత్ రెడ్డి

అంతకముందు పేపర్ లీక్ వ్యవహారంపై రేవంత్ ఆరోపణలు చేశారు. ఒకే మండలంలో 100 మందికి ర్యాంకులు వచ్చాయని పేర్కొన్నారు. గ్రూప్-1లో కేటీఆర్ పీఏ స్వంత మండలంలో వంద మందికి వందకు పైగా మార్కులు వచ్చాయని రేవంత్ ఆరోపణలు చేశారు. పేపర్ లీక్ పై రేవంత్ చేసిన ఆరోపణలకు గానూ ఆయనకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే రేవంత్ రెడ్డి కార్యాలయ అధికారులు మాత్రం సిట్ నుంచి ఎలాంటి నోటీసులు రాలేదని అంటున్నారు.

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం సంచలనంగా మారింది. పేపర్ లీకేజీలో ఇద్దరు వ్యక్తులకే ప్రమేయం ఉందని ఎలా చెబుతారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేటీఆర్ ఏమైనా ప్రత్యేక విచారణ అధికారా అని పేర్కొన్నారు. చంచల్ గూడ జైలు సందర్శకుల వివరాలు బయటపెట్టాలన్నారు. మార్చి 13-18 మధ్య ఎవరెవరు జైలును సందర్శించారో వెల్లడించాలని డిమాండ్ చేశారు.

Revanth Reddy : కేసీఆర్, కేటీఆర్ ప్రమేయం లేకుండా ఏ స్కామ్ కూడా జరగలేదు, ఆంధ్రా వ్యక్తికి ఉద్యోగం ఎలా ఇచ్చారు?-రేవంత్ రెడ్డి

పేపర్ లీక్ తో తనకు సంబంధం లేదని కేటీఆర్ వితండవాదం చేస్తున్నారని పేర్కొన్నారు. చంచల్ గూడ జైలు సీసీ టీవీ ఫుటేజ్ బయటపెట్టాలన్నారు. 20 మంది అక్రమంగా పరీక్ష రాశారని పేర్కొన్నారు. 2015 నుంచి పేపర్ లీకేజీ జరుగుతోందన్నారు. కేసు విచారణ సక్రమంగా జరగడం లేదని చెప్పారు.
గ్రూప్-1లో వంద మార్కులకుపైగా వచ్చిన వారందరి వివరాలను ప్రభుత్వం బయట పెట్టాలని డిమాండ్ చేశారు.

పెద్దల పేర్లు చెబితే నిందితులను ఎన్ కౌంటర్ చేస్తామని బెదిరించారని పేర్కొన్నారు. టీఎస్పీఎస్సీలో పని చేస్తూ పోటీ పరీక్షలకు ఎలా ప్రిపేర్ అవుతారని ప్రశ్నించారు. కేటీఆర్ ఏపీ తిరుపతి..ఏ-2 రాజశేఖర్ ఇద్దరిది పక్క పక్క గ్రామాలన్నారు. తిరుపతి వల్లే రాజశేఖర్ కు ఉద్యోగం వచ్చిందని తెలిపారు. కేటీఆర్ ఆఫీస్ నుంచే ఇదంతా జరిగిందని చెప్పారు. పేపర్ లేకేజీపై రేవంత్ ఆరోపణలు చేసినందుకుగానూ సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రేవంత్ గురువారం సిట్ ముందు హాజరయ్యారు.