Alliant Group In HYD : కేటీఆర్ అమెరికా పర్యటన..హైద‌రాబాద్‌కు అలియంట్ గ్రూపు, 9వేల ఉద్యోగ అవకాశాలు

పెట్టుబడులకు స్వర్గధామంగా మారిన హైదరబాద్ నగరాన్ని మరింత అభివృద్ధి చేసే విధంగా మంత్రి కేటీఆర్ కృషి చేస్తున్నారు. దీని కోసం అమెరికాలో పర్యటిస్తున్న మంత్రి హైదరాబాద్ కు అలియంట్ గ్రూప్ వచ్చేవిధంగా చేశారు. దీంతో తొమ్మిదివేల కొత్త ఉద్యోగాలు లభించనున్నాయి.

Alliant Group In HYD : కేటీఆర్ అమెరికా పర్యటన..హైద‌రాబాద్‌కు అలియంట్ గ్రూపు, 9వేల ఉద్యోగ అవకాశాలు

alliant group In Hyderabad

Ministe KTR Alliant Group In HYD : మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనకు ఫలితంగా హైదరాబాద్ కు పెట్టుబడులు వెల్లువెత్తనున్నాయి. మంత్రి కేటీఆర్ అమెరికాలో పలు కంపెనీల ప్రతినిధులుతో భేటీ అవుతున్నారు. పెట్టుబడులకు తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్ ఎంత అనుకూలమైనదో వివరిస్తు పెట్టుబడులను ఆకర్షించే విధంగా కృషి చేస్తున్నారు. ఆ కృషికి ఫలితంగా హైదరాబాద్ కు అలియంట్ గ్రూప్ (Alliant Group) రానుంది. హూస్ట‌న్‌లో అమెరికాలో అలియంట్ గ్రూప్ సీఈవో ధవల్ జాదవ్ తో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. దీంతో హైదరాబాద్ లోపెట్టుబడులకు అల్లియంట్ గ్రూప్ అంగీకరించింది. దీంతో తొమ్మిదివేల ఉద్యోగాలు లభించనున్నాయని కేటీఆర్ తెలిపారు.

బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగాలను పలు ప్రోత్సాహకాలు లభించనున్నాయి. హైదరాబాద్ లో బీఎఫ్ఎస్ఐ రంగంలో అలియంట్ సంస్థకు ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. దీంతో ఈ గ్రూప్ హైదరాబాద్ కు రానుండటంతో 9 వేల ఉద్యోగాలు లభించనున్నాయి. ఇప్పటికే 1000మందితో సేవలందిస్తున్న వెల్లియంట్ గ్రూప్ తెలంగాణ ప్రభుత్వ సహకారంతో హైదరాబాద్ లో విస్తరించటానికి సిద్ధమైంది.

క‌న్స‌ల్టింగ్‌, ఫైనాన్షియ‌ల్ స‌ర్వీసెస్‌లో ప‌వ‌ర్‌హౌజ్‌గా పేరుగాంచిన అలియంట్ గ్రూపు .. హైద‌రాబాద్‌లోని బీఎఫ్ఎస్ఐ రంగాన్ని బ‌లోపేతం చేయ‌నుందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. దీంతో సదరు కంపెనీ హైదరాబాద్ లో 9వేల ఉద్యోగాలు కల్పించనుందని తెలిపారు. ట్యాక్స్‌, అకౌంటింగ్‌, ఆడిట్ స‌ర్వీస్‌, ఐటీ టెక్నాల‌జీకి చెందిన యువ‌త‌కు ఇది మంచి అవకాశంగా మారుతుందన్నారు. బీఎఫ్ఎస్ఐ ప‌రిశ్ర‌మ‌కు హైద‌రాబాద్ న‌గ‌రం కేంద్ర బిందువుగా మారుతోంద‌ని..అలియంట్ సంస్థ తీసుకున్న నిర్ణ‌యం హైదరాబాద్ నగరంపై ఉన్న న‌మ్మ‌కాన్ని చూపుతుంద‌ని మంత్రి త‌న ట్వీట్‌లో వెల్ల‌డించారు.