తెలంగాణ చరిత్రలోనే అత్యంత భారీ పెట్టుబడి, రూ.20వేల కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్న అమెజాన్

  • Published By: naveen ,Published On : November 6, 2020 / 12:00 PM IST
తెలంగాణ చరిత్రలోనే అత్యంత భారీ పెట్టుబడి, రూ.20వేల కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్న అమెజాన్

amazon investments in telangana: ప్రపంచ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టనుంది. ఏకంగా రూ.20వేల 761 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది అమెజాన్. 2022 నాటికి హైదరాబాద్ లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ ను ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలంగాణలో మల్టిపుల్ డేటా సెంటర్లను అమెజాన్ ఏర్పాటు చేయనుంది. తెలంగాణలో అతిపెద్ద ఎఫ్డీఐ ఇన్వెస్ట్ మెంట్ ఇదే అని ఐటీ మంత్రి కేటీఆర్ చెప్పారు. అమెజాన్ పెట్టుబడుల పట్ల కేటీఆర్ ఆనందం వ్యక్తం చేశారు.

* తెలంగాణ చరిత్రలోనే అత్యంత భారీ పెట్టుబడి
* రూ.20వేల 761 కోట్లు పెట్టుబడి పెడుతున్న అమెజాన్ వెబ్ సర్వీసెస్
* తెలంగాణ ప్రభుత్వంతో అమెజాన్ ఒప్పందం

* తెలంగాణలో పలు చోట్ల డేటా సెంటర్లు ఏర్పాటు చేయనున్న అమెజాన్
* 2022 జూన్ నాటికి హైదరాబాద్ లో క్లౌడ్ సెంటర్ ఏర్పాటు చేయనున్న అమెజాన్
* తెలంగాణలో అతిపెద్ద ఎఫ్ డీఐ ఇన్వెస్ట్ మెంట్ ఇదే-కేటీఆర్

ముంబై తర్వాత హైదరాబాద్‌నే ఎంచుకున్న అమెజాన్:
తెలంగాణ చరిత్రలోనే భారీ పెట్టుబడి రాబోతోంది. అమెజాన్ వెబ్ సర్వీసెస్… తెలంగాణలో 20 వేల 761 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. 2022 జూన్ నాటికి ఆమెజాన్ ఆసియా ఫసిఫిక్ రీజియన్ కార్యకలాపాలు హైదరాబాద్‌లో ప్రారంభం కాబోతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా అమెజాన్… మల్టిపుల్ డేటా సెంటర్స్‌ను ఏర్పాటు చేయనుంది. 2016లో ఆసియా ఫసిఫిక్ రీజియన్ ముంబైని ప్రారంభించిన అమెజాన్ వెబ్ సర్వీసెస్…ఇప్పుడు హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభించబోతోంది. వెబ్ సర్వీసెస్‌కు ముంబై తర్వాత హైదరాబాద్‌నే కేంద్రంగా ఎంచుకుంది అమెజాన్. దీనికి సంబంధించి అమెజాన్ వెబ్ సర్వీసెస్ కూడా ప్రకటన చేసింది.
https://10tv.in/amazon-wins-interim-relief-future-reliance-deal-put-on-hold/
సర్వీసులను మరింత విస్తరించుకునేందుకు ఐటీ హబ్ హైదరాబాద్‌ను ఎంచుకున్న అమెజాన్:
అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్రపంచంలోనే అతి పెద్ద క్లౌడ్ ఫ్లాట్‌ఫాం సర్వీసులను అందిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న గ్లోబల్ డేటా సెంటర్స్ ద్వారా 175కు పైగా అత్యాధునిక సర్వీసులను అమెజాన్ వెబ్ సర్వీసెస్ అందిస్తోంది. బేసిస్ టెక్నికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సర్వీసుల నుంచి ఆన్ డిమాండ్ క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసులను అందిస్తోంది. అమెజాన్ వెబ్ సర్వీసెస్… తన సర్వీసులను మరింత విస్తరించుకునేందుకు ఐటీ హబ్ హైదరాబాద్‌ను ఎంచుకుంది.

2022 జూన్ నుంచి… హైదరాబాద్‌ కేంద్రంగా ఆమెజాన్ వెబ్ సర్వీస్‌లు ప్రారంభం:
ఇప్పటికే ముంబై కేంద్రంగా ఉన్న కార్యకలాపాలను ఇప్పుడు హైదరాబాద్‌కు విస్తరించింది. 20 వేల 761 కోట్ల పెట్టుబడులతో తెలంగాణలో అమెజాన్ వెబ్ సర్వీసెస్‌ను ప్రారంభించబోతోంది. తెలంగాణ కేంద్రంగా అమెజాన్ వెబ్ సర్వీసెస్…మొత్తం మూడు అవైలబిలిటీ జోన్లను ఏర్పాటు చేస్తోంది. ఆసియాలో ఇలాంటి రీజియిన్స్‌ను ఇప్పటికే 10 ఉన్నాయి. 2022 జూన్ నుంచి… హైదరాబాద్‌ కేంద్రంగా ఆమెజాన్ వెబ్ సర్వీస్‌లు ప్రారంభం కానున్నాయి.