TG Covid – 19 : తెలంగాణలో ఎక్కువవుతున్న కేసులు …నైట్ కర్ఫ్యూ విధిస్తారా ?

నైట్ కర్ఫ్యూ విధించే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. బార్లు, పబ్‌లు, స్కూళ్లు, కాలేజీలు, మాల్స్‌, థియేటర్లపైనా ఆంక్షలు విధించే అవకాశముందని చెబుతున్నారు...

TG Covid – 19 : తెలంగాణలో ఎక్కువవుతున్న కేసులు …నైట్ కర్ఫ్యూ విధిస్తారా ?

Night Curfew

Night Curfew Telangana: కోవిడ్ రోజువారీ కేసులు తగ్గకుండా ఇదే స్థాయిలో విజంభిస్తే తెలంగాణలో ఆంక్షలు విధించే అవకాశం లేకపోలేదు. సంక్రాంతి ముగిసేసరికి కేసులు మరింతగా పెరిగితే ఆంక్షలు నైట్ కర్ఫ్యూ విధించే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. బార్లు, పబ్‌లు, స్కూళ్లు, కాలేజీలు, మాల్స్‌, థియేటర్లపైనా ఆంక్షలు విధించే అవకాశముందని చెబుతున్నారు. అటు ఏపీ సర్కార్‌ కూడా అలర్ట్ అయ్యింది. గత అనుభవాల దృష్ట్యా కోవిడ్ ఆసుపత్రుల్లో మెరుగైన చికిత్సకు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.

Read More : Niraj Bishnoi : సూసైడ్ చేసుకుంటానని బెదిరిస్తున్న బుల్లి బాయ్

ఈ నెల 3న తెలంగాణలో 482 కేసులు నమోదైతే..4న ఏకంగా వెయ్యి కేసులు దాటాయి. ఆ రోజు వెయ్యి 52 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. ఈ నెల 5న 15 వందల 50 కేసులు నమోదైతే..6న 19 వందల 13 మందికి కరోనా బారినపడ్డారు. 7, 8 వరుసగా రెండు రోజులు రెండు వేలకు పైగా కేసులు వచ్చాయి. 7న రెండు వేల రెండు వందల 97 మందికి పాజిటివ్ కన్‌ఫర్మ్‌ అయితే…8న రెండు వేల 606 మంది కోవిడ్ బారినపడ్డారు. తెలంగాణలో యాక్టివ్ కేసుల సంఖ్య 12 వేల 180కి పెరిగింది.

Read More : Luxury Naxalites: నక్సల్స్ వద్ద ఆ కార్లను చూసి బిత్తరపోయిన పోలీసులు

ఏపీలోనూ కోవిడ్‌ వైరస్‌ వార్నింగ్ బెల్స్‌ మోగిస్తోంది. ఏపీలో వరుసగా రెండో రోజు 8 వందలకు పైగా కోవిడ్‌ బారినపడ్డారు. ఈ నెల 3న 122 మందికి పాజిటివ్ నిర్ధారణ అయితే..4న 334 మందికి కోవిడ్ సోకింది. 5న కొత్త కేసులు 434 రికార్డయ్యాయి. 6వ తేదీన ఏకంగా 547 మందికి పాజిటివ్ కన్‌ఫర్మ్‌ అయ్యింది. మొన్న 840 మంది కోవిడ్‌ బారినపడితే, నిన్న 839 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. అక్టోబర్‌ రెండో తేదీ తర్వాత ఏపీలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి.