Amit Shah : ఇవాళ అమిత్ షాతో తెలంగాణ బీజేపీ నేతల భేటీ

2023లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా అధికారం చేపట్టడమే లక్ష్యంగా బీజేపీ పనిచేయాలని ఈ సమావేశంలో అమిత్ షా సూచనలు........

Amit Shah : ఇవాళ అమిత్ షాతో తెలంగాణ బీజేపీ నేతల భేటీ

Amit Shah With Telangana Bjp Leaders

Amit Shah : కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్ర నేత అమిత్ షాతో తెలంగాణ బీజేపీ ముఖ్య నేతల భేటీ ఇవాళ జరగనుంది. ఢిల్లీలో జరగనున్న ఈ సమావేశంలో పాల్గొనేందుకు రాష్ట్ర బీజేపీ కీలక నేతలంతా ఇప్పటికే దేశ రాజధానికి చేరుకున్నారు.

Read Also : Telangana Ministers : నేడు కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌తో తెలంగాణ మంత్రులు, ఎంపీల బృందం భేటీ

తెలంగాణ బీజేపీ ఇంచార్జ్ తరుణ్ చుగ్, ఎంపీలు బండి సంజయ్, కిషన్ రెడ్డి, సోయం బాపూరావు, ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్ రావు, ఈటల రాజేందర్ ఈ భేటీలో పాల్గొంటున్నారు. ఇదే సమావేశానికి రాష్ట్ర బీజేపీ సీనియర్ నేత డీకే అరుణతోపాటు.. ఇటీవలే పార్టీలో చేరిన విఠల్, తీన్మార్ మల్లన్న కూడా హాజరవుతున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, టీఆర్ఎస్‌ను ఎదుర్కొనే వ్యూహాలు, పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో ప్రజా సంగ్రామ యాత్రపై చర్చించనున్నారు. పార్టీ బలోపేతంపైనా నేతలకు అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నారు.

2023లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా అధికారం చేపట్టడమే లక్ష్యంగా బీజేపీ పనిచేయాలని ఈ సమావేశంలో అమిత్ షా సూచనలు చేసే అవకాశాలున్నాయి. ఇప్పటికే పలు ఎన్నికల్లో జోరు చూపించిన బీజేపీ.. హుజూరాబాద్ ఎన్నికల్లో గెలుపుతో మరింత ఉత్సాహంగా ఉంది. హుజూరాబాద్ లో గెలుపు తర్వాత అమిత్ షాతో జరుగుతున్న విస్తృతస్థాయి సమావేశం ఇదే కావడంతో.. అందరి దృష్టి ఈ మీటింగ్ పైనే ఉంది.

Read Also : Dearness Allowance : ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త… డీఏ విడుదల

వానాకాలం, యాసంగి వడ్ల కొనుగోలు, తెలంగాణ రైతుల ప్రయోజనాలు, ఇంటర్ విద్యార్థుల సమస్యలు, నిరుద్యోగం, టీఆర్ఎస్ హామీలు లాంటి పలు అంశాలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా మరింత దూకుడుగా వెళ్లాలని ఇప్పటికే హైకమాండ్ తెలంగాణ బీజేపీకి సూచించింది.