Amul Invests : తెలంగాణలో అమూల్ భారీ పెట్టుబడులు.. ప్రభుత్వంతో ఎంవోయూ

తెలంగాణ పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ తో సమావేశమైన అమూల్ కంపెనీ ప్రతినిధులు ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకున్నారు.

Amul Invests : తెలంగాణలో అమూల్ భారీ పెట్టుబడులు.. ప్రభుత్వంతో ఎంవోయూ

Amul

Amul Company invests in Telangana : దేశీయ డైరీ దిగ్గజం అమూల్ తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టనుంది. తెలంగాణలోని స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ లో రెండు దశల్లో మొత్తం రూ.500 కోట్లతో పెట్టుబడి పెట్టబోతున్నట్లు అమూల్ కంపెనీ తెలిపింది. ఈ మేరకు అమూల్ కంపెనీ.. తెలంగాణ ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకుంది. దక్షిణ భారతదేశంలోని అమూల్ కంపెనీ తన తొలి ప్లాంట్ ను ప్రతి రోజూ 5లక్షల లీటర్ల సామర్థ్యంతో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

భవిష్యత్ లో 10 లక్షలకు పెంచుకునే అవకాశం ఉందని వివరించింది. ఈ ప్లాంట్ నిర్మాణం ద్వారా బటర్ మిల్క్, పెరుగు, లస్కీ, పన్నీరు, స్వీట్స్ వంటి ఉత్పత్తులను తెలంగాణ నుంచి ఉప్పత్తి చేయనున్నట్లు అమూల్ కంపెనీ తెలిపింది. దీంతోపాటు అమూల్ తన బేకరీ ప్రొడక్షన్ డివిజన్ ను తెలంగాణలో ఏర్పాటు చేయనుంది. బ్రెడ్, బిస్కెట్స్ ఇతర ప్రొడక్ట్స్ ను ఉత్పత్తి చేయనుంది.

Sajjala Ramakrishnareddy : చంద్రబాబు అజెండానే బీజేపీ అజెండా : సజ్జల

తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తో సమావేశమైన అమూల్ కంపెనీ ప్రతినిధులు తెలంగాణ ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకున్నారు. దక్షిణ భారతదేశంలోని తన తొలి డైరీ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తున్న అమూల్ కంపెనీని కేటీఆర్ అభినందించారు. తెలంగాణలో మరో శ్వేత విప్లవం ప్రారంభమైందన్నారు. అమూల్ దేశ పాడిపరిశ్రమ రూపురేఖలు మార్చిందన్నారు. ప్రపంచానికి పాడి రంగంలో గొప్ప పాఠాలు చెబుతుందని కొనియాడారు.