Couple Suicide : హైదరాబాద్ లో దంపతులు ఆత్మహత్య

హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో వృద్ధ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన మంగళవారం వెంకట్ రావు నగర్ లో చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.

Couple Suicide : హైదరాబాద్ లో దంపతులు ఆత్మహత్య

Couple Suicide : హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో వృద్ధ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన మంగళవారం వెంకట్ రావు నగర్ లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్ పల్లిలోని వెంకట్ రావు నగర్ లో సోమిరెడ్డి(65), మంజుల(58) భార్యభర్తలు నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు. పెద్ద కుమారుడు మియాపూర్ లో ఉంటున్నాడు.

చిన్న కొడుకు విదేశాల్లో ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో గాజులరామారంలో ఉంటున్న మంజుల సోదరుడు వెంకటరెడ్డి మంగళవారం ఉదయం సోమిరెడ్డికి ఫోన్ చేశారు. అయితే ఎన్నిసార్లు ఫోన్ చేసినా సోమిరెడ్డి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చి వెంకటరెడ్డి స్వయంగా తానే ఇంటికి వెళ్లి చూడగా దంపతులిద్దరూ చనిపోయి ఉన్నారు.

Student Suicide In IFLU :హైదరాబాద్ ఇఫ్లూ యూనివర్సిటీలో విద్యార్థిని ఆత్మహత్య

దీంతో వెంకటరెడ్డి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు. అనారోగ్యంతో దంపతులిద్దరు ఆత్మహత్య చేసుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.