SI Suspended : ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేసిన పట్టించుకోని ఎస్ఐ.. సస్పెండ్ చేసిన సీపీ
హైదరాబాద్ పాతబస్తీ చాంద్రాయణగుట్ట పోలీసట్ స్టేషన్ పరిధిలో బుధవారం జరిగిన దారుణ హత్య తీవ్ర సంచలనానికి దారి తీసిన విషయం తెలిసిందే.

Si Suspended
SI Suspended : హైదరాబాద్ పాతబస్తీ చాంద్రాయణగుట్ట పోలీసట్ స్టేషన్ పరిధిలో బుధవారం జరిగిన దారుణ హత్య తీవ్ర సంచలనానికి దారి తీసిన విషయం తెలిసిందే. బండ్ల గూడ రోడ్డుపై హమీద్ అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు వేటాడి దారుణంగా హత్య చేశారు. కారులో వెళ్తున్న హామీద్ ను బయటకు లాగి కత్తులతో పొడిచి చంపారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహం స్వాధీనం చేసుకొని పోస్టుమార్టానికి పంపారు. సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించి నిందితుల కోసం వేట ప్రారంభించారు.
చదవండి : Hyderabad : పాదచారులపై దూసుకెళ్లిన కారు.. ఒకరు మృతి
మరోవైపు ఈ హత్య ఘటన విషయంలో పోలీసులపై విమర్శలు వస్తున్నాయి. హమీద్ తనకు ప్రాణహాని ఉందని బుధవారం ఉదయం ఎస్‌ఐ వెంకటేష్ ఫిర్యాదు చేశారని.. అయినా ఆయన పట్టించుకోలేదని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ఎస్‌ఐ వెంకటేష్‌ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎస్ఐ తక్షణమే స్పందించి ఉంటే హమీద్ ప్రాణాలతో ఉండేవాడని కుటుంబ సభ్యులు, స్నేహితులు అంటున్నారు.
చదవండి : Hyderabad : చార్మినార్ వద్ద సండే – ఫండే నిర్వహిస్తే ఎలా ఉంటుంది ?