Hyderabad Terror Conspiracy : హైదరాబాద్ లో ఉగ్రకుట్ర భగ్నం కేసులో మరొకరు అరెస్టు

హైదరాబాద్ లో ఉగ్రకుట్ర భగ్నం కేసులో మరొకరు అరెస్టు అయ్యారు. ఈ కేసులో అబ్దుల్ కలీం అనే మరో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. హ్యాండ్ గ్రనేడ్ల కేసులో ఇప్పటికే జాహిద్, షారుఖ్, సమియుద్దీన్ ను అరెస్టు చేశారు.

Hyderabad Terror Conspiracy : హైదరాబాద్ లో ఉగ్రకుట్ర భగ్నం కేసులో మరొకరు అరెస్టు

accused arrested

Hyderabad terror conspiracy : హైదరాబాద్ లో ఉగ్రకుట్ర భగ్నం కేసులో మరొకరు అరెస్టు అయ్యారు. ఈ కేసులో అబ్దుల్ కలీం అనే మరో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. హ్యాండ్ గ్రనేడ్ల కేసులో ఇప్పటికే జాహిద్, షారుఖ్, సమియుద్దీన్ ను అరెస్టు చేశారు. నిందితులు చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీులుగా ఉన్నారు. తాజాగా మరో నిందితుడు అబ్దుల్ కలీంను అరెస్టు చేశారు. జాహిద్ కు అబ్దుల్ కలీం రూ.40 లక్షలు సమకూర్చారు. పాకిస్తాన్ నుంచి మనోహరాబాద్ కు హ్యాండ్ గ్రనేడ్లు సరఫరా చేశారు.

జాహిద్ గ్యాంగ్ మనోహరాబాద్ నుంచి హైదరాబాద్ కు గ్రనేడ్లు తీసుకొచ్చారు. గతంలోనే హైదరాబాద్ పోలీసులు ఈ కేసులో ముగ్గురు నిందితులు జాహిద్, షారుఖ్, సమియుద్దీన్ అరెస్టు చేశారు. వారి దగ్గర నుంచి నాలుగు హ్యాండ్ గ్రనేడ్లు, రూ.4.5 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. జాహిద్ కు అబ్దుల్ కలీం రూ.40 లక్షలు సమకూర్చినట్లు గతంలోనే పోలీసులు గుర్తించారు. పాకిస్తాన్ నుంచి మనోహరాబాద్ కు హ్యాండ్ గ్రనేడ్లు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు.

Terrorists: భారీ ఉగ్రకుట్ర భగ్నం.. ఇద్దరు అల్ ఖైదా ఉగ్రవాదులు అరెస్ట్!

ఈ కేసును ఎన్ఐఏ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఉగ్రవాద కుట్ర ఉన్న నేపథ్యంలో ఈ కేసులో ఇంకా ఎవరెవరున్నారనే కోణంలో ఎన్ఐఏ అధికారులు పూర్తిగా ఆరా తీస్తున్నారు.ఇందులో భాగంగానే శుక్రవారం మరో నిందితుడు అబ్దుల్ కలీంను ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు. అతన్ని కూడా కస్టడీలోకి తీసుకుని విచారిస్తే ఇంకా దీనికి వెనుక ఎవరెవరు ఉన్నారో తెలుస్తుందని భావిస్తున్నారు.