తెలంగాణలో మరో వ్యక్తికి కరోనా..స్కాట్‌లాండ్‌ వెళ్లొచ్చిన వ్యాపారికి వైరస్

తెలంగాణలో కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. నగరంలో ఇప్పటికే మూడు పాజిటివ్‌ కేసులుండగా...నిన్న మరొకరికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. స్కాట్లాండ్‌ వెళ్లివచ్చిన ఓ వ్యాపారికి వైరస్‌ సోకినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది.

  • Published By: veegamteam ,Published On : March 17, 2020 / 01:54 AM IST
తెలంగాణలో మరో వ్యక్తికి కరోనా..స్కాట్‌లాండ్‌ వెళ్లొచ్చిన వ్యాపారికి వైరస్

తెలంగాణలో కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. నగరంలో ఇప్పటికే మూడు పాజిటివ్‌ కేసులుండగా…నిన్న మరొకరికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. స్కాట్లాండ్‌ వెళ్లివచ్చిన ఓ వ్యాపారికి వైరస్‌ సోకినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది.

తెలంగాణలో కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. నగరంలో ఇప్పటికే మూడు పాజిటివ్‌ కేసులుండగా…నిన్న మరొకరికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. స్కాట్లాండ్‌ వెళ్లివచ్చిన ఓ వ్యాపారికి వైరస్‌ సోకినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం ఆయన గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. జూబ్లీహిల్స్‌కు చెందిన ఈయన.. ఈ నెల 7న హైదరాబాద్‌ నుంచి స్కాట్లాండ్‌ వెళ్లాడు. 13న స్కాట్లాండ్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చాడు. 15న కోవిడ్‌ లక్షణాలతో గాంధీ ఆస్పత్రిలో చేరారు.  అతడికి నిర్వహించిన రిపోర్టులో కరోనా పాజిటివ్‌గా తేలింది. కరోనా బారినపడి చికిత్స తీసుకున్న ఓ వ్యక్తి ఇప్పటికే డిశ్చార్జ్‌ కాగా… ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో ముగ్గురు పాజిటివ్‌ లక్షణాలతో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇటలీ నుంచి వచ్చిన ఓ యువతి, నెదర్లాండ్‌ నుంచి వచ్చిన మరో వ్యక్తి  ఉన్నారు. మరో 20 మంది కోవిడ్‌ అనుమానిత లక్షణాలతో చికిత్స పొందుతున్నారు. వీరి పరీక్షల నివేదికలు రావాల్సి ఉంది. 

See Also | రోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి రైలు బోగీల్లో ఏసీ ఇకపై 25 డిగ్రీలే..కర్టెన్ల తొలగించారు

హైరిస్క్‌ దేశాల నుంచి వచ్చిన 22 మందిని అనంతగిరి హరిత హోటల్‌కు 
హైరిస్క్‌ దేశాల నుంచి వచ్చిన 22 మందిని వికారాబాద్‌ జిల్లా అనంతగిరి హరిత హోటల్‌కు తరలించారు. వీరు చైనా, ఇటలీ, ఇరాన్, ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీ, దక్షిణ కొరియాల నుంచి వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. హరిత హోటల్‌లో వీరికి ప్రత్యేకంగా గదులు కేటాయించారు. అక్కడ మొత్తం 32 గదులున్నాయని, ఒక కుటుంబం మొత్తం ఒకే గదిలో ఉందని అధికారులు తెలిపారు. మరోవైపు హరిత రిసార్ట్‌ ఇప్పటికే కరోనా అనుమానిత వ్యక్తులతో నిండిపోయింది. దీంతో ఇక నుంచి ఎవరినీ అక్కడికి పంపవద్దని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం హరిత రిసార్ట్‌లో ఉన్న వారిని పంపిస్తే.. ఆ ప్లేస్‌లో మరికొంత మందిని తరలించనున్నారు.

గచ్చిబౌలి స్టేడియంలో మరో 400 గదులు 
గచ్చిబౌలి స్టేడియానికి అనుబంధంగా ఉన్న టవర్లలో 400 గదులు అందుబాటులో ఉన్నాయి. వాటిని త్వరలో అందుబాటులోకి తీసుకొస్తారు. అవసరమైతే వాటిని శాశ్వతంగా వైరస్‌ నియంత్రణ ఆస్పత్రిగా మార్చాలన్న ఆలోచనలో సర్కారు ఉంది. నేటి నుంచి విదేశాల నుంచి వచ్చే వారిని గచ్చిబౌలి స్టేడియానికే తరలించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. గచ్చిబౌలి స్టేడియంలోని గదులు నిండితే.. ఫారెస్ట్‌ అకాడమీకి తరలించనున్నారు. ఇందుకోసం అక్కడ కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.  ఫారెస్ట్‌ అకాడమీ సహా మరో నాలుగైదు ప్రభుత్వ సంస్థలకు చెందిన భవనాలను కూడా సిద్ధం చేస్తున్నారు. 

తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం 
మహారాష్ట్రలో అత్యధిక కోవిడ్‌ కేసులు నమోదవుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. మహారాష్ట్ర నుంచి తెలంగాణకు వచ్చే రూట్లలో, చెక్‌పోస్ట్‌ల వద్ద ప్రత్యేక తనిఖీలు చేస్తున్నారు. ధర్మబాద్, బోరజ్, జహీరాబాద్, సిర్పూర్‌ కాగజ్‌ నగర్‌ శివారుల్లోని చెక్‌ పోస్ట్‌ల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అవసరమైన చోట థర్మల్‌ స్క్రీనింగ్‌లు ఏర్పాటు చేయాలని భావిస్తోంది.