TS Govt Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ .. మరో జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసిన టీఎస్‌పీఎస్‌సీ

తెలంగాణలోని నిరుద్యోగులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. రవాణాశాఖలో 113 ఏఎంవీఐ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఆగస్ట్‌ 5 నుంచి సెప్టెంబర్‌ 5 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది.

TS Govt Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ .. మరో జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసిన టీఎస్‌పీఎస్‌సీ

Tspsc

TS Govt Jobs: తెలంగాణలోని నిరుద్యోగులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో 80వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న కేసీఆర్ ప్రకటన మేరకు వరుసగా నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. తాజాగా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) నిరుద్యోగులకు శుభవార్త వినిపించింది.

Govt Jobs: నిరుద్యోగుల‌కు గుడ్‌న్యూస్‌.. 2,440 ఉద్యోగాల భ‌ర్తీకి ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్

రాష్ట్రంలో అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఏఎంవీఐ) ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. రవాణాశాఖలో 113 ఏఎంవీఐ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఆగస్ట్‌ 5 నుంచి సెప్టెంబర్‌ 5 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపింది. అభ్యర్థులు www.tspsc.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.  మల్టీ జోన్ల వారీగా ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మల్టీ జోన్-I లో 54 ఖాళీలు, మల్టీ జోన్-II లో 59 ఖాళీలు ఉన్నాయి. మెకానికల్ ఇంజనీరింగ్/ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ లేదా అందుకు సమానమైన విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.