నిజాలు చెప్పే ప్రతి ఒక్కరూ చనిపోతున్నారా? చెన్నకేశవులు తండ్రిది ప్రీ ప్లాన్డ్ మర్డరా? దిశ కేసులో మరో సంచలనం

నిజాలు చెప్పే ప్రతి ఒక్కరూ చనిపోతున్నారా? చెన్నకేశవులు తండ్రిది ప్రీ ప్లాన్డ్ మర్డరా? దిశ కేసులో మరో సంచలనం

another sensation in disha case: ఏడాది క్రితం దేశం మొత్తం సంచలనం రేపి దిశ హత్య కేసు ఇప్పుడు మరిన్ని సంచలనాల మయం కాబోతోంది. దిశ హత్య ఉదంతమే తీవ్ర విషాదాంతమైతే, ఆ కేసు నిందితుల ఎన్ కౌంటర్ మరో సంచలనం. ఈ సంఘటనలపై సినిమా తీసేందుకు రామ్ గోపాల్ వర్మ చేసిన ప్రయత్నాలు మరో సెన్సేషన్. అలాంటి కేసులో ఎన్ కౌంటర్ లో చనిపోయిన నలుగురు నిందితుల కుటుంబసభ్యులు దిశ కమిషన్ దృష్టికి తీసుకెళ్లిన అంశాలు తాజాగా మరో సంచలనానికి తెరతీశాయి.

కేసు వాపస్ తీసుకునేందుకు రూ.25లక్షలు ఇవ్వజూపింది ఎవరు? నిందితుడు చెన్నకేశవులు తండ్రి యాక్సిడెంట్ యాధృచికమా? లేక మర్డర్ ప్లాన్ లో భాగమా? నిందితులు కుటుంబసభ్యుల్లో ఉన్న అనుమానాలు ఏంటి? భయాలు ఏంటి?

దిశ కేసులో నిందితుల కుటుంబాలను భయాలు వెంటాడుతున్నాయి. నిందితుల కుటుంబసభ్యులు యాక్సిడెంట్లలో చనిపోతున్నారు. తమకు ప్రాణహాని ఉందని వాపోతున్నారు. కాగా, యాక్సిడెంట్ వెనుక కుట్రకోణం ఉందని బాధితులు అంటున్నారు.

కేసు వెనక్కి తీసుకోవాలని ప్రలోభాలు పెడుతున్నది ఎవరు? ఒక్కో కుటుంబానికి రూ.25లక్షలు ఇస్తామని ఆఫర్ ఇచ్చింది ఎవరు? లొంగకపోతే ప్రాణాలు తీస్తామని బెదిరిస్తున్నది ఎవరు? చెన్నకేశవులు తండ్రి యాక్సిడెంట్ వెనుక ఉన్నది ఎవరు? నిజాలు చెప్పే ప్రతి ఒక్కరూ చనిపోతున్నారా?

దిశ ఎన్ కౌంటర్ లో మృతి చెందిన నలుగురు నిందితుల కుటుంబాలు ఇప్పుడు బిక్కుబిక్కుమంటున్నాయి. తమకు ప్రాణహాని ఉందంటూ సుప్రీంకోర్టు నియమించిన దిశ కమిషన్ ముందు గోడు వెళ్లబోసుకున్నాయి. తమ ప్రాణాలు కాపాడాలని కమిషన్ సభ్యులను వేడుకున్నాయి. హైకోర్టులో ఉన్న కేసుని వెనక్కి తీసుకోవాలని కొందరు వ్యక్తులు తమను ప్రలోభ పెడుతున్నారని, దిశ కేసు నిందితులు కుటుంబసభ్యులు చెబుతున్నారు. తాము చెప్పినట్లు చేస్తే ఒక్కో కుటుంబానికి రూ.25లక్షలు ఇస్తామని ఆశ చూపుతున్నట్లు తెలిపారు.

చెన్నకేశవులు తండ్రి కుర్మయ్యను దుండగులు యాక్సిడెంట్ చేసి హత్య చేశారని ఆరోపిస్తున్నారు. నిజాలు మాట్లాడే ప్రతి వ్యక్తి ఈ కేసులో చనిపోతున్నారని, వారికి యాక్సిడెంట్లు అవుతున్నాయని చెబుతున్నారు. కుర్మయ్య తనకు యాక్సిడెంట్ కావడానికి నాలుగు రోజుల ముందే రాబోయే ప్రమాదం గురించి చెప్పాడు అంటున్నారు. ఆయన చెప్పినట్టుగానే యాక్సిడెంట్ జరిగి చనిపోయాడంటున్నారు.

లారీ ఓనర్ శ్రీనివాస్ రెడ్డిపై నిందితులు కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో శ్రీనివాస్ రెడ్డిని పూర్తి స్థాయిలో లోతుగా విచారిస్తే సంచలన విషయాలు బయటపడతాయని అంటున్నారు. కాగా ఎన్ కౌంటర్ వ్యవహారంపై హైకోర్టులో కేసు ఉండటంతో, ఆ కేసుని వెనక్కి తీసుకోవాలని ఓవైపు పోలీసులు, మరోవైపు కొందరు గుడిగండ్ల గ్రామ పెద్దలు ప్రలోభాలకు గురి చేస్తున్నారని, దిశ కమిషన్ కు ఫిర్యాదు చేశారు.

ఎన్ కౌంటర్ అయిన కొద్ది రోజులకే చెన్నకేశవులు తండ్రి కుర్మయ్య యాక్సిడెంట్ లో చనిపోయాడు. అయితే కుర్మయ్య ప్రమాదం కేసులో తమకు అనుమానాలున్నాయన్నారు కుటుంబ సభ్యులు. దిశ హత్య జరిగిన రోజు లారీ ఓనర్ శ్రీనివాస్ రెడ్డి… కుర్మయ్య ఇంటికి వచ్చాడనీ.. చెన్న కేశవులను తనతో పంపాలని కోరాడని కమిషన్ ముందు చెప్పారు. ఆ తర్వాత చెన్నకేశవరెడ్డి అరెస్టు, ఎన్ కౌంటర్ జరిగాయన్నారు. ఈ విషయంలో శ్రీనివాస్ రెడ్డిని కుర్మయ్య నిలదీయడంతో…ఎక్కడ తన గురించి బయట పెడతాడోనని యాక్సిడెంట్ చేశాడని కమిషన్ కు లేఖ అందించారు. చెన్నకేశవులు తండ్రి కుర్మయ్య యాక్సిడెంట్ జరిగినప్పటి నుంచి తమకి ప్రాణ హాని ఉందంటున్నారు నిందితుల కుటుంబ సభ్యులు.

దిశ కేసు నిందితుల కుటుంబాలకు ఉన్న అనుమానాలన్నింటిని అఫిడవిట్ రూపంలో అందజేయాలని జుడిషియల్ కమిషన్ తెలిపింది. ప్రాణహాని ఉంటే పోలీసు ప్రొటెక్షన్ తీసుకోవచ్చని సూచించింది. జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తుంటే దిశ కేసులో నలుగురు నిందితులు కాకుండా మరికొందరి ప్రమేయం ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.