Three Days Rains : తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలే..

తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. వాతావరణంలో మార్పుల కారణంగా వచ్చే మూడు రోజుల్లో పలుచోట్ల వర్షాలు పడనున్నాయి.

Three Days Rains : తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలే..

Another Three Days Rains In Telangana State

Three Days Rains in Telangana State : తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. వాతావరణంలో మార్పుల కారణంగా వచ్చే మూడు రోజుల్లో పలుచోట్ల వర్షాలు పడనున్నాయి. ఉత్తర కర్ణాటక పరిసర ప్రాంతాల్లో సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి ఏర్పడింది. సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి కొనసాగుతోంది.

ద్రోణి ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడనున్నాయి. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, వడగండ్లు పడనున్నాయి. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురవనుంది. ఉత్తర, మధ్య, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఒకచోట.. రెండు ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

ఇప్పటికే ఆదిలాబాద్‌, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్‌, మెదక్‌ తదితర జిల్లాల్లో వర్షం కురిసింది. అలాగే వికారాబాద్‌ జిల్లా మొయిన్‌పేటలో 31.5 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. పలు చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. వర్షాల కారణంగా పిడుగుపాటుకు గురై ఇద్దరు మృతిచెందారు.